Nani:సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. ఆ సినిమా హీరోకి నచ్చే బ్యాచ్ ఆ సినిమాని ప్రమోట్ చేస్తుంటే, నచ్చని బ్యాచ్ మాత్రం తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఒక్క ఇద్దరు సినిమాలకు కాదు.. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు ఇదే సేమ్ కనిపిస్తుంది.
నాని ‘ది ప్యారడైజ్’పై ట్రోలింగ్ :
తాజాగా నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ మూమెంట్లను ఇదే విధంగా సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్కు గురయ్యాయి. మరీ ముఖ్యంగా నాని(Nani) ‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ రివ్యూ రావడం, సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లేపేశారు అనడం, నాని యాక్టింగ్కు ప్రశంసలు దక్కిన శ్రీకాంత్ ఓదెల టేకింగ్కు మైనస్ రివ్యూస్ రావడం అభిమానుల్ని కొంచెం నిరాశపరిచాయి.
వైరల్ అవుతున్న మీమ్ ఇదే :
అయితే ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో మీమ్ పేజీల్లో బాగా హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక మీమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక టాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్ భార్యాభర్తలు నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ఫ్లాప్ అవ్వాలి అంటూ గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించారు అన్న విధంగా చెప్పే మీమ్ సోషల్ మీడియాలో విపరీతంగా హైలెట్ అవుతుంది.
ALSO READ:TOLLYWOOD:సినీ పరిశ్రమలో విషాదం..సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్. రవిచంద్ర కన్నుమూత..!
ఆ సెలబ్రిటీ కపుల్ ఎవరు?:
ఆ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కపుల్ ఎవరు అనేది కామెంట్ల రూపంలో కొంతమంది గెస్ చేసి పేర్లు రాస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇది కావాలనే ఫేక్ అని, నాని సినిమా బాగుంది.. నెగటివ్ రివ్యూలు ఎవరో కావాలని ఇస్తున్నారు అంటూ నాని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:The Paradise Movie Review:ది ప్యారడైజ్ మూవీ రివ్యూ: నాని మాస్ అవతారం ఎలా ఉంది?
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ :
పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం సినిమా చూసి వచ్చి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్గా స్పందిస్తూ ఉండడంతో నాని ‘ది ప్యారడైజ్’ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినట్లయితే, కొంతమంది సినిమా బాగుంది అంటే, మరి కొంతమంది బాగోలేదు అంటున్నారు. కొంతమంది ఫస్ట్ ఆఫ్ సూపర్.. సెకండ్ ఆఫ్ అట్టర్ ప్లాప్ అంటున్నారు.
మొత్తానికి నాని ‘ది ప్యారడైజ్’ సినిమాతో ఏదో ప్రూవ్ చేయాలి అనుకున్నాడు.. ఇంకేదో ప్రూవ్ చేసుకునే విధంగా చేసుకున్నాడు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఇప్పుడు నాని ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూస్ హాట్ టాపిక్గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఏం అనుకుంటున్నారు. నిజంగానే నాని సినిమాని తొక్కేశారా..? లేక నాని సినిమా నిజంగానే బాగోలేదా..? మీ ఆన్సర్ కామెంట్ రూపంలో ఇవ్వండి




