Thursday, September 24, 2026
HomeLATESTSumalatha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్యపై దాడి..!

Sumalatha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్యపై దాడి..!

Sumalatha: డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై కొంతమంది మహిళా డాన్సర్లు దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Sumalatha: టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్, గత కొంతకాలంగా ఏదో ఒక విషయంలో ఈయన పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా శ్రేష్టి వర్మ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ పేరు, ఆయన భార్య సుమలత పేరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు అయిన సుమలత పైన తోటి డాన్సర్స్ సైతం తాజాగా దాడి చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తెలుగు సినీ డాన్సర్ అసోసియేషన్ కార్యవర్గంలో పలు రకాల గొడవలు మొదలయ్యాయి.

సుమలతపై తోటి డాన్సర్స్ దాడి..

సుమలత(Sumalatha) ప్రెసిడెంట్ గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దు రఘు మాస్టర్ నే కొత్తగా అధ్యక్షుడిగా ఎంచుకోవాలని మరొక వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రెండు వర్గాలు విడిపోయి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోని ఫిలిం ఫెడరేషన్ రఘు మాస్టర్ కు తమ మద్దతు తెలపగా, అనేక వాదోపవాదనల అనంతరం బుధవారం ఉదయం వెంకటగిరిలో ఒక ఫంక్షన్ హాల్ లో రఘు మాస్టర్ వర్గంతో పాటు సుమలత వర్గాన్ని పిలిచి మరి ఫెడరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Nani:నాని సినిమా ఫ్లాప్ అవ్వాలని ఆ స్టార్ హీరో భార్యభర్తలు పూజలు చేశారా..?

సుమలతకు ఎదురు దెబ్బ..

ఈ క్రమంలోనే సుమలత ను ప్రెసిడెంట్ గా కొనసాగించాలంటూ 11 మంది మాత్రమే ఆమెకు మద్దతుగా తెలియజేశారు. కానీ రఘు మాస్టర్ కావాలని 214 మంది చేతులెత్తి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే సుమలత మీద కొంతమంది డాన్సర్లు దాడికి దిగినట్లుగా వినిపిస్తోంది. అనంతరం ఆమె ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి మీడియా ముందు తన వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యింది. కానీ చివరి నిమిషంలో ఆ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుమలత దౌర్జన్యంగా మినిట్స్ బుక్కును తీసుకున్నందుకు ప్రయత్నించడంతోనే తాము అడ్డుకున్నామని లేడీ డాన్సర్స్ సైతం తెలియజేస్తున్నారు. అయితే అనంతరం ఈ విషయం పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమలత ఫిర్యాదు చేసేందుకు తన వర్గం వారితో కలిసి వెళ్లినట్లుగా సమాచారం.మరి విషయం పైన ఆమె పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:TOLLYWOOD:సినీ పరిశ్రమలో విషాదం..సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్. రవిచంద్ర కన్నుమూత..!

సుమలత నిర్ణయం ఏంటి?

తెలుగు సినీ డాన్సర్ అసోసియేషన్ (TFTDDA) వివాదం గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షరాలు ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ భార్య సుమలతకు ఒక ఊహించని షాక్ తగిలింది. సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈరోజు సుమలత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you