Actress Anjali:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించింది. అదే క్రేజీతో తెలుగు, తమిళ్ వంటి భాషలలో పలు సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. గతంలో ఒక ప్రముఖ నటుడుతో ప్రేమలో ఉందని రూమర్స్ కూడా వినిపించాయి. త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల చేత వారిద్దరు విడిపోయారనే రూమర్స్ కూడా వినిపించాయి. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న అంజలి ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది.
నాకు లేని తొందరగా నీకెందుకు..
తాజాగా అంజలి (Actress Anjali)తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి తన మ్యారేజ్ ప్లాన్ పైన ఓపెన్ గానే మాట్లాడింది. వివాహం చేసుకోవాలనే ఒత్తిడి తన కుటుంబం నుంచి లేదని ఇప్పట్లో తాను ఆ దిశగా ఆలోచించలేదని కూడా తెలిపింది. ఎవరి కోసమో తాను పెళ్లి పీటలు ఎక్కనని , తనకు నచ్చినప్పుడే సరైన వ్యక్తి దొరికినప్పుడే వివాహం చేసుకుంటానంటూ తెలిపింది. పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాట వినాల్సిన పని లేదు.. తొందర పడాల్సిన అవసరం లేదంటూ తెలియజేసింది అంజలి.
also read:Actress Arrested:సినీ ఇండస్ట్రీలో షాకింగ్ సీన్..సెక్స్ రాకెట్ కేసులో సినీ నటి అరెస్ట్..!
పెళ్లి పైన అంజలి ఊహించని కామెంట్స్..
అలాగే తన పెళ్లి పైన మాట్లాడుతూ.. పెళ్లి అయ్యాక తల్లిదండ్రులతో సహా అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు..చివరికి తాను , భర్త మాత్రమే మిగులుతామని తనకు తన స్నేహితులకు చక్కగా ముస్తాబాద్ ఫోటోషూట్లు చేయడం వంటివి చాలా ఇష్టమని ఫన్నీగా తెలిపింది. అయితే అలా ఎంజాయ్ చేయడానికి తాను ఎందుకు పెళ్లి చేసుకోవాలని కూడా తెలియజేసింది. ఈ సందర్భంగా తన స్నేహితులకు ఒక ఫన్నీ ఆఫర్ ఇచ్చింది అంజలి.. మీరే పెళ్లి చేసుకోండి ఆ వేడుకలకు నేను చక్కగా రెడీ అయ్యి వస్తాను ఫోటోషూట్లలో పాల్గొందాం అంటూ తన స్నేహితులకు సరదాగా లైవ్ లోని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి అంజలి తన పెళ్లి పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
also read:Srikanth Odela:ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్.. కుక్క సీన్‌పై శ్రీకాంత్ ఓపెన్ కామెంట్స్!
అంజలి సినీ కెరియర్..
అంజలి సినీ కెరియర్ విషయానికి వస్తే 2006లో ఫోటో అనే తెలుగు చిత్రంతో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత జర్నీ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులారిటీ సంపాదించిన అంజలి బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, తదితర చిత్రాలలో నటించింది. అంజలి పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది అలాగే పలు రకాల స్పెషల్ సాంగులలో కూడా కనిపించింది అంజలి. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఒక సినిమా, మలయాళం లో ఒక సినిమాలో నటిస్తోంది. తెలుగులో మాత్రం చివరిగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో మాత్రమే నటించింది.




