Srushti :బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో మరో ఎలిమినేషన్ కి టైం వచ్చేసింది. నాలుగో వారంలో మోడల్ సృష్టి వ్యాకరణం హౌస్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో వెనుకబడటంతో ఆమె ఎలిమినేషన్‌కు గురైనట్లు టాక్ వినిపిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సృష్టి వ్యాకరణం.. ‘అగ్నిపరీక్ష’లో తన ప్రతిభను నిరూపించుకుని బిగ్ బాస్ తెలుగు 10లో అవకాశం దక్కించుకుంది.
నాలుగో వారంలో ఎలిమినేషన్ :
బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారంలో నామినేషన్ల నుంచి చివరి వరకు పరిస్థితులు మారుతూ వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత సృష్టి వ్యాకరణం, దేబ్జానీ, అమన్‌లు డేంజర్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి దశకు వచ్చేసరికి సృష్టి వ్యాకరణానికి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించిన సృష్టి(Srushti ).. రెండో వారంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆమె ఆటతీరుపై నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్లో సూచనలు కూడా చేశారు.
also read:Aamani Actress:”అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు”.. ఆమని సెన్సేషనల్ కామెంట్స్..!
సుధీర్‌తో వివాదం :
మూడో వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియ సృష్టి వ్యాకరణం జర్నీలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. సుధీర్‌తో జరిగిన వాగ్వాదం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుధీర్ విషయంలో వచ్చిన కామెంట్లపై సృష్టి తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఆమె ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. దీంతో ఆమె పై పూర్తిగా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు జనాలు.
ఈ వివాదం తర్వాత సృష్టి గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని, అది ఆమె ఓటింగ్‌పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read:Srikanth Odela:సుకుమార్ ఆఫీస్ గేటు దగ్గర 4 ఏళ్లు.. శ్రీకాంత్ ఓదెల సంచలన విషయాలు!
సృష్టి రెమ్యునరేషన్ ఎంత? :
బిగ్ బాస్ హౌస్‌లో సృష్టి వ్యాకరణం నాలుగు వారాల పాటు కొనసాగింది. వారానికి గాను రూ.75 వేల చొప్పున ఆమెకు రెమ్యునరేషన్ నిర్ణయించినట్లు సమాచారం అందుతుంది. ఈ లెక్కన నాలుగు వారాలకు ఆమెకు సుమారు రూ.3 లక్షలు పారితోషికంగా అందినట్లు టాక్.
అంతకుముందు ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సృష్టికి సుమారు రూ.50 వేల వరకు పారితోషికం అందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో ఆమెకు లభించిన రెమ్యునరేషన్ కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3.50 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మొత్తానికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెల్లడికాలేదు. బిగ్ బాస్ హౌస్‌లో తక్కువ సమయంలోనే తనదైన శైలిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సృష్టి.. ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు సంబంధించిన వార్తలు, పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. షో నుంచి బయటకు వచ్చినప్పటికీ సృష్టి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.




