Wednesday, November 4, 2026
HomeINTERVIEWSRenu Desai:పవన్ కోసం రేణు దేశాయ్.. షారుఖ్ కోసం కరణ్.. అప్పట్లో ఏం జరిగిందంటే?

Renu Desai:పవన్ కోసం రేణు దేశాయ్.. షారుఖ్ కోసం కరణ్.. అప్పట్లో ఏం జరిగిందంటే?

Renu Desai:పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె లండన్ వెళ్లారట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు అవసరమైన దుస్తు ఎంపికలను స్వయంగా చేసి తీసుకువచ్చేవారని ఆమె వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Renu Desai:సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ అప్పుడప్పుడు తన గత అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కోసం తాను లండన్‌లో బట్టలు కొనుగోలు చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

2001లో లండన్‌లో ఆసక్తికరమైన అనుభవం :

రేణు దేశాయ్ (Renu Desai)తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 26 ఏళ్ల క్రితం, అంటే 2001 సమయంలో పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె లండన్ వెళ్లారట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు అవసరమైన దుస్తు ఎంపికలను స్వయంగా చేసి తీసుకువచ్చేవారని ఆమె వెల్లడించారు. అప్పట్లో తనకు అధికారికంగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎలాంటి గుర్తింపు లేకపోయినా, పవన్‌పై ఉన్న అభిమానంతో ఎంతో ఇష్టంగా ఈ పని చేసేవారట. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -
Advertisement

షారుఖ్ కోసం కరణ్ జోహార్ కూడా..:

అయితే లండన్‌లో షాపింగ్ సమయంలో ఆమెకు మరో ఆసక్తికరమైన అనుభవం ఎదురైందట. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా అదే సమయంలో షారుఖ్ ఖాన్ కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు అక్కడికి వచ్చేవారని రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు. తామిద్దరూ తరచూ ఒకే రకమైన షాపులకు వెళ్లేవారని, అక్కడ చాలాసార్లు ఎదురుపడేవారని తెలిపారు. రేణు దేశాయ్ మాట్లాడిన మాటాలు ప్రస్తుత్తం నెట్టింట వైరల్ గా మారాయి.

ALSO READ:Jabardasth Rohini:కమిట్‌మెంట్ అడిగిన నిర్మాత మేనేజర్.. రోహిణి సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -
Advertisement

ఇద్దరిదీ ఒకటే అభిరుచి :

ఆ రోజుల్లో తామిద్దరూ వృత్తిపరంగా కాస్ట్యూమ్ డిజైనర్లు కాకపోయినప్పటికీ, తమ అభిమాన నటుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని రేణు దేశాయ్ వివరించారు. పవన్ కళ్యాణ్‌పై తనకున్న ఇష్టంతో ఆయనకు నచ్చే దుస్తులను ఎంపిక చేసేవారని, అదే విధంగా షారుఖ్ ఖాన్‌పై ఉన్న అభిమానంతో కరణ్ జోహార్ కూడా స్వయంగా దుస్తులను సెలెక్ట్ చేసేవారని చెప్పారు. ఆ టైంలో భలే సరదాగా ఉండేదని చెప్పుకొచ్చారు.

ALSO READ:Tabu:కింగ్ 100 నుంచి టబు పవర్‌ఫుల్ గ్లింప్స్.. రాజకీయ నాయకురాలిగా కొత్త అవతారం!

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు :

రేణు దేశాయ్ చెప్పిన ఈ పాత జ్ఞాపకాలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కోసం ఆమె తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, మరోవైపు షారుఖ్ ఖాన్ కోసం కరణ్ జోహార్ చేసిన ప్రయత్నం అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రెండు భిన్నమైన సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల మధ్య అప్పట్లో ఇలాంటి ఆసక్తికరమైన అనుభవం ఉండటం విశేషం. దీంతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you