Surekha Vani :టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ వీడియోను కొద్దిసేపటికే తొలగించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో :
సురేఖ వాణి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ యువకుడితో కలిసి ఉన్న సన్నిహిత క్షణాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో కొద్దిసేపటికే అందుబాటులో లేకుండా పోయింది. దీంతో పలువురు నెటిజన్లు డబుల్ మీనింగ్ అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. దీంతో అసలు ఆమె ఆ వీడియోను ఎందుకు తొలగించారు? అందులో ఉన్న యువకుడు ఎవరు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ముఖ్యంగా సురేఖ వాణి(Surekha Vani )వయస్సుకు, ఆ యువకుడి వయస్సుకు మధ్య వ్యత్యాసం ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు, అందులోని వ్యక్తి గుర్తింపు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
also read:Renu Desai:పవన్ కళ్యాణ్ తో విడాకులపై రేణూ దేశాయ్ ఏమందంటే?
రెండో పెళ్లిపై గతంలోనూ చర్చ :
సురేఖ వాణి వ్యక్తిగత జీవితం గురించి గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ విషయంపై ఆమె కుమార్తె సుప్రీత కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వచ్చినప్పటికీ సురేఖ వాణి మాత్రం రెండో పెళ్లి విషయంపై తన వైఖరిని గతంలోనే స్పష్టం చేశారు.
also read:Niharika NM: బ్లూ చీరలో గ్లామర్ తో ఆకట్టుకున్న నిహారిక.. ఫోటోలు వైరల్!
రెండో పెళ్లిపై సురేఖ వాణి ఏమన్నారంటే? :
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సురేఖ వాణి.. ప్రస్తుతం తనకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేదని గతంలో వెల్లడించారు. తన కుమార్తె సుప్రీతకు పెళ్లి వయస్సు వచ్చిందని, ఈ సమయంలో తన రెండో పెళ్లి గురించి మాట్లాడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకు నచ్చిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసుకునే స్వేచ్ఛ తనకు ఉందని కూడా గతంలో పేర్కొన్నారు.
అసలు విషయం ఏమిటి? :
తాజాగా వైరల్ అవుతున్న వీడియో వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారమా? లేక ఏదైనా సినిమా లేదా ఇతర కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషనా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై సురేఖ వాణి లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో అని ఫ్యాన్స్ వెయిటింగ్. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు ఆమె స్పందిస్తారా? అనేది చూడాలి..!!
Actress Surekha Vani, reportedly 49, is making headlines over her alleged relationship with a young guy.
Despite having a 25-year-old daughter, she has reportedly shared romantic moments with him on Instagram before deleting the video.
Age-gap relationships and personal choices are once again sparking debate on social media.
— KR!SH (@Krish_RC_) November 6, 2026




