Baby movie:తెలుగులో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం బేబీ. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. నిర్మాత గా SKN నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించగా.. హీరోగా ఆనంద్ దేవరకొండ నటించారు. కీలకమైన పాత్రలో నాగబాబు, హర్ష, విరాజ్ అశ్విన్ తదితర నటీనటులు నటించారు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి కూడా మంచి క్రేజ్ లభించింది. 2023లో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.
బేబీ సినిమా కథను దొంగలించారంటూ డైరెక్టర్, నిర్మాత కి నోటీసులు..
బేబీ (Baby movie)సినిమాకి సంబంధించి డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులను జారీ చేసింది..ప్రముఖ దర్శకుడు శిరీన్ శ్రీరామ్ దాఖలు చేసిన పిటిషన్ వల్ల న్యాయస్థానం వీరికి నోటీసులు ఇచ్చింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారని , తనను మోసం చేశారని అలాగే తన మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించారంటూ శిరిన్ శ్రీరామ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తన రైటర్స్ తో కలిసి డెవలప్మెంట్ చేసిన ప్రేమించొద్దు అనే సినిమా స్టోరీని తన అనుమతి లేకుండా బేబీ చిత్రంలో ఉపయోగించారంటూ పిటిషన్ లో తెలియజేశారు.
also read:Netflix:నెట్ ఫ్లిక్స్ కు కార్మిక సంఘాలు వార్నింగ్..!
పిటీషన్ లో ఏముందంటే?
శిరిన్ శ్రీరామ్ పిటిషన్ లో .. మొదట సాయి రాజేష్ ప్రేమించొద్దు సినిమాను నిర్మించాలనే ఆసక్తితో తనను సంప్రదించారని.. ఈ క్రమంలో తన రచయితల టీం తో కలిసి సుమారుగా ఏడాది పాటు శ్రమించి మరి కథను అభివృద్ధి చేశానని, కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్టోరీ పూర్తి అయిన తర్వాత సాయి రాజేష్ తమతో సంబంధం లేకుండా ఆ స్టోరీ ఆధారంగా చేసుకుని మరి బేబీ చిత్రాన్ని తీశారు అంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తమ టీం మోసపోయిందంటూ తెలిపారు శిరిన్ శ్రీరామ్.
also read:Akhil Akkineni:జపాన్‌లో అఖిల్ అక్కినేని సందడి.. ‘లెనిన్’ కోసం స్పెషల్ ప్రమోషన్స్.. ఎప్పుడంటే?
బేబీ లీక్స్ పేరుతో ఆధారాలు బట్టబయలు..
అయితే మొదట ఈ వివాదం ఫిబ్రవరి 2024లో వెలుగులోకి వచ్చింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి కథను కాపీ చేయడం, మోసం చేయడం వంటి ఆరోపణల పైన చర్యలు తీసుకోవాలని ఆశ్రయించారు. గతంలో ఆధారాలపైన ప్రశ్నించినప్పుడు బేబీ లీక్స్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు శిరిన్ శ్రీరామ్.. పిటిషన్ తరపున న్యాయవాది సురేందర్ వాదనలను వినిపించగా ఈ వాదనలను పరిశీలించిన తర్వాత హైకోర్టు అటు బేబీ దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతకు నోటీసులను జారీ చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయంపై చూడాలి మరి.




