Bigg Boss Telugu 10:వచ్చేసింది బిగ్ బాస్! బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందా..? ఎప్పుడు టీవీలో చూద్దామా అంటూ కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్న జనాలకు మంచి ఎంటర్‌టైన్మెంట్ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైపోయింది. గ్రాండ్‌గా ఈ షోను లాంచ్ చేశారు. అక్కినేని నాగార్జున ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్‌ను హోస్ట్ చేస్తున్నారు. సీజన్లు మారే కొద్దీ కంటెస్టెంట్లు మారుతున్నారే కానీ, హోస్ట్ మాత్రం మారడం లేదు అంటూ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
బిగ్ బాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నాగార్జున..:
అసలు పరిస్థితి ఎలా తయారయింది అంటే.. బిగ్ బాస్ అంటే నాగార్జున, నాగార్జున అంటే బిగ్ బాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు నాగార్జున. నాగార్జుననే ఎందుకు బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ హోస్ట్‌గా ఎంచుకుంటున్నారు? ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా అని సోషల్ మీడియాలో ప్రశ్నించే జనాలు కూడా ఉన్నారు.
also read:Ameesha Patel:హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు కౌంటర్!
నాగార్జున రెమ్యునరేషన్‌పై హాట్ టాపిక్..:
ఇవన్నీ పక్కన పెడితే.. బిగ్ బాస్ సీజన్ 10లోకి(Bigg Boss Telugu 10) వెళ్లిన హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్ల పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో తెలియదు కానీ, నాగార్జున పేరు మాత్రం ఈ విషయంలో బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 10 కోసం నాగార్జున తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. టెలివిజన్ హిస్టరీలోనే ఇది ఒక సెన్సేషనల్ రికార్డు అంటూ ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్‌గా వైరల్ అవుతుంది.
also read:OTT Releases: సెప్టెంబర్ రెండో వారం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు!
రూ.45 కోట్ల రెమ్యునరేషన్ అంటూ టాక్.. :
అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున ఈ బిగ్ బాస్ సీజన్ 10 కోసం దాదాపు రూ.45 కోట్ల ఫీజు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఆయన రూ.35 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.
ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్‌ను మరింత పెంచుతూ ఏకంగా రూ.45 కోట్లు ఫీజుగా తీసుకున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
నిజమైతే టెలివిజన్ హిస్టరీలో రికార్డే.. :
ఇది ఎంత నిజమో తెలియదు. కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం టెలివిజన్ చరిత్రలోనే ఇదొక సంచలన రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏ టీవీ షో హోస్ట్ కూడా ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోలేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ కోసం నాగార్జున అందుకుంటున్న పారితోషికం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లెక్కలు నిజమైతే టీవీ హోస్టింగ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న సెలబ్రిటీగా నాగార్జున సరికొత్త రికార్డు సృష్టించినట్టే అవుతుంది. దీంతో ఆయన రెమ్యునరేషన్‌పై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.




