Monday, September 7, 2026
HomeLATESTOTT Releases: సెప్టెంబర్ రెండో వారం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు!

OTT Releases: సెప్టెంబర్ రెండో వారం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు!

OTT Releases:సెప్టెంబర్ రెండో వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై అదిరిపోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

on
- Advertisement -banner Ad

OTT Releases:సెప్టెంబర్ రెండో వారం ఓటీటీ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించబోతోంది. హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, పీరియాడిక్ డ్రామా, రొమాన్స్‌, స్పోర్ట్స్‌ వంటి విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఎక్కువ టైటిల్స్‌ వస్తుండగా.. ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్‌, ఆపిల్ టీవీ ప్లస్‌లోనూ ఆసక్తికరమైన కంటెంట్‌(OTT Releases) అందుబాటులోకి రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా కొత్త టైటిల్స్ :

నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 8న ‘నార్త్ ఆఫ్ నార్త్’ సీజన్ 2 స్ట్రీమింగ్‌ కానుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించే యువతి చుట్టూ ఈ కథ సాగుతుంది.

- Advertisement -
Advertisement

సెప్టెంబర్ 9న ‘వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ అగైన్?’ ప్రేక్షకుల ముందుకు రానుంది. లేక్ కోమోలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ సందర్భంగా కలుసుకున్న స్నేహితులు, తమ పిల్లల ప్రేమ, వివాహ సమస్యలతో పాటు తమ గతాన్ని కూడా మరోసారి గుర్తుచేసుకుంటారు.

సెప్టెంబర్ 10న ‘క్రూ గర్ల్’, ‘కాల్ మై ఏజెంట్ ది మూవీ’, ‘చుంబక్’ విడుదల కానున్నాయి. రోయింగ్‌లో తన కలను నెరవేర్చుకునే టీనేజర్ కథ ‘క్రూ గర్ల్’ కాగా.. మిగతా రెండు టైటిల్స్‌లో కుటుంబ, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. సెప్టెంబర్ 11న ‘గో టీమ్!’, ‘స్టోలెన్ హార్ట్‌బీట్స్’ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:టీవీ ప్రేక్షకులకు పండగే.. ఈరోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా చూడొచ్చంటే?

జీ5లో క్రైమ్ థ్రిల్లర్స్ :

జీ5లో సెప్టెంబర్ 11న ‘పంచనామా’, ‘ఘమాసాన్’ విడుదల కానున్నాయి. సంక్లిష్టమైన కేసు దర్యాప్తు, అవినీతి, రహస్యాల నేపథ్యంలో ‘పంచనామా’ సాగుతుంది. ఇక నిజాయితీగల పోలీస్ అధికారి, శక్తిమంతమైన నేరస్థుడి మధ్య జరిగే పోరాటాన్ని ‘ఘమాసాన్’ చూపించనుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:MS Raju:హీరోయిన్ తో గొడవపై ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్..!

జియోహాట్‌స్టార్‌, ప్రైమ్ వీడియోలోనూ.. :

జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 11న ‘అలీ బాబా ఔర్ 40 భూత్’, ‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’ రానున్నాయి. హారర్ కామెడీతో పాటు సినిమా పరిశ్రమ నేపథ్యంలోని కథలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 11న ‘ది రివల్యూషనరీస్’ స్ట్రీమింగ్‌ కానుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ భారత స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను ఈ పీరియాడిక్ సిరీస్‌లో చూపించనున్నారు.

ఆపిల్ టీవీ ప్లస్‌లో ఆసక్తికరమైన కథ :

ఆపిల్ టీవీ ప్లస్‌లో సెప్టెంబర్ 9న ‘లాస్ట్ సీన్’ స్ట్రీమింగ్‌కు రానుంది. అదృశ్యమైన తన కుమార్తె నుంచి వచ్చినట్లుగా భావించే ఓ అత్యవసర ఫోన్ కాల్‌తో కథానాయకుడు ఆమె ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, ఉత్కంఠభరిత సంఘటనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సస్పెన్స్‌, ఎమోషన్‌కు ప్రాధాన్యమున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తంగా అన్ని చూసుకున్నట్లైతే ఈ వారం ఓటీటీ వేదికలపై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా విభిన్న జానర్ల కంటెంట్ సందడి చేయనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you