Maa inti Bangaram Review:2023లో ఖుషీ తర్వాత మరో తెలుగు సినిమా చేయని సమంత(Samantha) రెండవ వివాహం తర్వాత తొలిసారి తెలుగులో చేసిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి(Nandhini Reddy )దర్శకత్వంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సొంత నిర్మాణంలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? సమంత తెలుగింటి కోడలు అనిపించుకుందా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
మా ఇంటి బంగారం సినిమా కథ:
స్వప్న (సమంత) ప్రేమ వివాహం చేసుకొని ఒక గ్రామంలోని సాంప్రదాయ కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెడుతుంది. అది పెద్ద కుటుంబం..పైగా కుటుంబ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉండటం ఆమెకు కష్టంగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీని ఆకట్టుకోవడానికి స్వప్న ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా చిన్న కోడలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి అడుగుజాడల్లో నడవాలని కుటుంబ సభ్యులు చెప్పడం మధ్యలో శ్రీముఖి – సమంత మధ్య గొడవలు ఏర్పడడం అన్నీ కూడా ప్రేక్షకులను మోస్తారుగా మెప్పించాయి. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో స్వప్న గతానికి చెందిన వ్యక్తులు రావడంతో కథ మలుపు తీసుకుంటుంది. కరుణ (గుల్షన్ దేవయ్య ) అనే విలన్ ఆమె జీవితంతో ఆడుకుంటాడు. స్వప్న గతం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె భర్త అలాగే ఆమె కుటుంబం ఎలా స్పందించింది? ఆమె జీవితంలోకి మళ్లీ ప్రవేశించిన గుల్షన్ దేవయ్యకు ఎలా ఎదురొడ్డి నిలిచింది? అనేది మిగతా కథ
also read:Naga bandham trailer:అనంత పద్మనాభ ఆలయ రహస్యాలతో ఆకట్టుకుంటున్న నాగబంధం ట్రైలర్!
విశ్లేషణ:
మా ఇంటి బంగారం సినిమా కథ కొత్తదేమీ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన పాత ఫార్మాట్ కమర్షియల్ కథ. అయితే ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే ఈ కథను ఈసారి హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అదే సినిమాకి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది. బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు. ప్రతి సీన్ జరిగే ముందు ఈమె ఎవరో తెలుసా? ఆ రేంజ్ లో ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఇంటర్వెల్ వరకు ఇలాంటి కథతోనే నడిపించింది డైరెక్టర్. అక్కడక్కడ అలాంటి ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మొదటి గంట ఆసక్తికరంగా ఉంటుంది, ఆ తర్వాత రొటీన్‌గా మారిపోతుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు తలకిందులవుతాయి.
సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. నెమ్మదిగానే మొదలై యాక్షన్ సన్నివేశాలతో ఊపందుకుంటుంది. ముఖ్యంగా సమంత బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా బాగానే ఉన్నాయి. అంతేకాదు తన స్టార్ పవర్ తో చాలా వరకు ఈ సినిమాని సమంత తన భుజాలపైనే మోసింది. ఇకపోతే అనుకున్నంత రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ కాదు కానీ కోటింగ్ మాత్రం బాగానే ఇచ్చాడు.
also read:Peddi Movie:ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న పెద్ది.. ఎప్పుడు ? ఎక్కడ చూడొచ్చంటే?
ప్లస్ పాయింట్స్:
సమంత వన్ మ్యాన్ షో
మిగతా నటీనటుల పర్ఫామెన్స్
ఎమోషనల్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్:
స్వప్న పాత్రను డిజైన్ చేసుకున్న డైరెక్టర్ ఆ పాత్రను అదే స్థాయిలో చూపించడంలో విఫలమయింది.
గుల్షన్ దేవయ్య విలన్ క్యారెక్టర్ ను ఇంకా కాస్త గట్టిగా రాసుకొని ఉంటే బాగుండేది.
ముందే ఊహించేలా కొన్ని సన్నివేశాలు ఉండడం
సినిమా చాలా బాగా ఎమోషనల్ గా, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా నడిపిన కొన్ని సీన్స్ మాత్రం బోర్ కొట్టిస్తాయి.
ఇంట్లో కొత్త కోడలు చుట్టూ అంత పెద్ద డ్రామా జరుగుతుంటే.. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం తెలియకపోవడం లాజిక్ లేదనిపిస్తుంది.
చివరిగా..
ఈ సినిమా పక్కా మాస్ ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం బాగా మెప్పిస్తుంది.
రేటింగ్:
2/5


