Sunday, May 17, 2026
HomeINTERVIEWSPeddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్,

on
banner Ad

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi Movie). బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి? (Peddi Movie Fight Master Interview)

మాది మణిపూర్. అయితే నా చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడే పెరిగాను. నాన్నగారి ఇన్‌స్పిరేషన్‌తో నేను ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్‌లో 18 ఏళ్ల అనుభవం ఉంది. అసిస్టెంట్ మాస్టర్‌గా విజయ్ మాస్టర్ దగ్గర, రామ్-లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర పని చేశాను. ‘పుష్ప’ మూవీతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ తర్వాత ‘పుష్ప 2’,మనశంకర వరప్రసాద్, ‘డకాయిట్’… ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలు చేస్తున్నాను.

Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

‘పెద్ది’ అవకాశం ఎలా వచ్చింది?
‘పుష్ప 2’ జరుగుతున్నప్పుడే బుచ్చిబాబు గారు నాతో మాట్లాడారు. ‘పెద్ది’లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పారు. అది యాక్షన్ సీక్వెన్స్ కాదు కానీ యాక్షన్‌లా ఉండాలని అన్నారు. నాకు చాలా సర్ప్రైజ్‌గా అనిపించింది. అలా ఆ సీక్వెన్స్ కోసం గ్లింప్స్‌లో చూపించిన బ్యాటింగ్ స్టైల్ షాట్ కంపోజ్ చేశాను. అది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం బుచ్చిబాబు గారు నాకే ఇచ్చారు. ఆయనది చాలా మంచి మనసు.

-‘పెద్ది’లో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. చరణ్ గారు ప్రేక్షకులను ‘పెద్ది’ వరల్డ్‌లోకి తీసుకెళ్లిపోతారు. ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. సినిమాలో యాక్షన్ మరో లెవెల్‌లో ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఫ్రెష్‌గా ఉంటుంది.

-బుచ్చిబాబు గారు ఇచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా చాలెంజ్‌గా తీసుకుని చేసినవే. ఇంట్రో దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఎపిసోడ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

బ్యాటింగ్ షాట్ ఎలా కంపోజ్ చేశారు?
-నేను హఫీజ్‌పేట్‌లో పెరిగాను. అది ఫుల్ మాస్ ఏరియా. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎలాగైనా సిక్స్ కొట్టాలనే తాపత్రయం వుంటుంది. ఆ తాపత్రయంతో బ్యాట్‌ని కింద నుంచి గట్టిగా కొట్టేవాళ్లం. అలాంటి మాస్ స్టైల్ నుంచే ఆ షాట్ పుట్టింది.

ఇందులో మీకు ఛాలెంజ్ గా అనిపించిన యాక్షన్ సీక్వెన్స్ ?
-ఇందులో మా గురువుగారు రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పోలీస్ స్టేషన్‌లో ఒక ఎపిసోడ్ చేశారు. కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వారి నాన్నగారు శ్యామ్ కౌశల్‌ను సంప్రదించాం. ఇందులో నేషనల్ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలు ఉంటాయి. చాలా నేచురల్‌గా ఆ సీక్వెన్స్‌ను చేయడం జరిగింది. అలాగే ఇందులో ఒక కుస్తీ ఎపిసోడ్ ఉంటుంది. అది ఫుల్ మాస్. ఇప్పటివరకు అలాంటి మాస్ ఎవరూ చూసి ఉండరు. మరో కుస్తీ ఎపిసోడ్ కూడా ఉంది. అది చాలా చాలెంజింగ్‌గా అనిపించింది.

రామ్ చరణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రామ్ చరణ్ గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే… మనం ఏం చెబుతున్నామో అది చాలా శ్రద్ధగా వింటారు. ఆయన టెక్నీషియన్లను చాలా బాగా నమ్ముతారు. ఇందులో ఆయన చాలా కష్టపడ్డారు. ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆయన బాడీ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, డైట్‌లో ఉంటూ ఆయన యాక్షన్ కోసం పడిన కష్టం మామూలుది కాదు. నియమాలు పాటిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఎంతో కష్టపడ్డారు. చరణ్ గారు గద పట్టుకున్న సీక్వెన్స్ కుస్తీలోనిది. ట్రైలర్ వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి.

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

-నేను యాక్షన్ పరంగా చాలా క్లియర్‌గా ఉంటాను. ఒక క్యారెక్టర్ ఎంత యాక్షన్ మోయగలదో అంతవరకే చేయాలి. అప్పుడే బిలీవబిలిటీ ఉంటుంది. చరణ్ గారు ‘మగధీర’ లాంటి ఎన్నో అద్భుతమైన యాక్షన్ సినిమాలు చేసి వచ్చారు. ఆయన యాక్షన్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు.

చరణ్ గారికి గాయం ఎలా జరిగింది?
-ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. ఒక రోల్ మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు పొరపాటున అలా జరిగింది. ఈ సందర్భంగా చరణ్ గారి గొప్పతనం గురించి చెప్పాలి. ఆ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు పొరపాటు తనవైపే ఉందని ఓపెన్ గా చెప్పారు. నిజంగా ఏ హీరో కూడా అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కు ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేసుకుని మరుసటి రోజుకే షూటింగ్‌కు వచ్చేశారు. నేను షాక్ అయిపోయాను. ఒకసారి అనుకుంటే అది పూర్తవ్వాలి… అదే ఆయన కమిట్‌మెంట్, డెడికేషన్.

శివరాజ్‌కుమార్ గారికి యాక్షన్ సీన్స్ ఉన్నాయా?
-ఇందులో దివ్యేందు, శివరాజ్‌కుమార్ సార్‌తో కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. శివరాజ్ గారి ఎనర్జీ లెవెల్స్ సూపర్. ఆయన చాలా స్ట్రాంగ్ విల్‌పవర్‌తో ఉంటారు. చరణ్ గారు చిరంజీవి గారికి యాక్షన్ సీక్వెన్స్‌లు చూపించారు. నా గురించి చాలా మంచి విషయాలు చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘పెద్ది’లో ఎమోషన్స్‌కు ఫస్ట్ హాఫ్ నుంచే కనెక్ట్ అయిపోతారు. ఆ ఎమోషన్ మామూలుగా ఉండదు. గ్లోబల్ స్టార్ పేరుకు తగ్గట్టుగానే చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ‘పెద్ది’ జర్నీ అందరికీ ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది.

రామ్-లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర పనిచేశారు కదా… వారు మీకు ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తుంటారు?
-‘పుష్ప’ సినిమా చూసి “ఒక గురువు పేరు నిలబెట్టావురా” అని మెచ్చుకున్నారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యాక్షన్ పరంగా వాళ్లే నాకు ఇన్‌స్పిరేషన్.

కొత్తగా చేస్తున్న సినిమాలు?
-‘ప్యారడైజ్’, ‘రౌడీ జనార్ధన్’, వంశీ గారు – సల్మాన్ ఖాన్ గారి సినిమా, చిరంజీవి గారు – బాబి గారి సినిమాలు చేస్తున్నాను.

Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you