Wednesday, August 12, 2026
HomeLATESTActress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

Actress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

Actress Roja: ప్రముఖ హీరోయిన్ రోజా రీఎంట్రీ లో భాగంగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక చిత్రం ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతోంది.

on
- Advertisement -banner Ad

Actress Roja:టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించిన రోజా సినిమాలకు దూరమైన తర్వాత పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి నగరి నియోజవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ పార్టీలో మంత్రిగా కూడా పనిచేసింది. అనంతరం సినిమాలకు దూరమైన రోజా మళ్లీ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సుమారుగా రోజా అన్ని భాషలలో కలిపి వందకు పైగా చిత్రాలలో నటించింది. గతంలో జబర్దస్త్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించిన రోజా కొన్ని కారణాల చేత వాటిని వదిలేసింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీఎంట్రీ మూవీ ..

చివరిగా 2013లో పవిత్ర అనే చిత్రంలో కనిపించిన రోజా ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై నటించిన చిత్రం అన్బే డయానా అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా జులై నెలలో థియేటర్లలో విడుదలై మంచి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టడంతో రోజాకి కూడా మంచి పేరు లభించింది. అయితే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే విడుదల అయింది. తెలుగులో రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం ఓటీటిలోకి రాబోతోంది. అన్బే డయానా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss-10:బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఆసక్తికర పరిణామాలు.. జడ్జీలకే కౌంటర్లు ఇచ్చిన కంటెస్టెంట్లు..!

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆగస్టు 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళం తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ఎలావళగన్ కథ , కథనం దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో హీరోగా కూడా నటించారు. ఆయన తరసన రమ్య రంగనాథన్ హీరోయిన్గా నటించారు. వీరితోపాటు రోజా(Actress Roja), పరిత బంగాల్ గోపి, నిఖిలా శంకర్, సుదర్శన్ గాంధీ తదితరులు కీలకమైన పాత్రల నటించారు. రీ ఎంట్రీ తర్వాత రోజా నటించిన సినిమా కావడం చేత అభిమానులు కూడా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Trisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..!

రోజా కెరియర్..

1991లో ప్రేమ తపస్సు అనే చిత్రం ద్వారా సినీ కెరియర్ ని మొదలుపెట్టిన రోజా, తన కెరియర్లో ఎన్నో చిత్రాలలో నటించింది. అలాగే కన్నడ , మలయాళం వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. బుల్లితెర పైన ఎన్నో షోలకు జడ్జిగా వ్యవహరించిన రోజా.. ప్రస్తుతం డ్రామా జూనియర్స్ సీజన్ 9లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you