Tuesday, September 29, 2026
HomeLATESTprudhvi raj:"జబర్దస్త్ లో జరిగేదంతా మోసం,దగా".. షాకింగ్ మ్యాటర్ బయటపెట్టిన కామెడీయన్..!

prudhvi raj:”జబర్దస్త్ లో జరిగేదంతా మోసం,దగా”.. షాకింగ్ మ్యాటర్ బయటపెట్టిన కామెడీయన్..!

prudhvi raj:జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్స్ వేసినప్పుడు నవ్వు రాకపోయినా సరే బలవంతంగా నవ్వాలని పృథ్వీరాజ్ చెప్పారు.

on
- Advertisement -banner Ad

prudhvi raj:జబర్దస్త్ ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అప్పటివరకు డాన్స్ షోలు, పాటలు మాత్రమే ఇలా ఒక షోస్‌గా జరిగేవి. కానీ కామెడీని కూడా జనాలు ఎంకరేజ్ చేస్తారు అన్న ఉద్దేశంతో జబర్దస్త్ కామెడీ షోను రూపొందించారు. కొత్త కొత్త కమెడియన్స్‌ను బుల్లితెరకు పరిచయం చేశారు.

అప్పుడు బుల్లితెరపై చిన్న చిన్న కామెడీ స్కిట్స్ వేసుకున్న కమెడియన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లు కనిపిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక స్టార్ హీరో కన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకొని జబర్దస్త్ కమెడియన్స్ రాజ్యమేలుతున్నారు.

- Advertisement -
Advertisement

ఒకప్పటిలా జబర్దస్త్ ఇప్పుడు లేదు:

అయితే ఒకప్పటిలా జబర్దస్త్ ఇప్పుడు లేదు అనేది అందరి మాట. ఒకప్పుడు చాలా కామెడీగా ఉండేదని, ఇప్పుడు మాత్రం పూర్తి డబుల్ మీనింగ్ డైలాగ్స్, అదే విధంగా వల్గర్‌గా ఉండే పంచెస్ ఉంటున్నాయని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

అయితే పలువురు కమెడియన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కమెడియన్ పృథ్వీరాజ్(prudhvi raj) ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. జబర్దస్త్ షో అంతా ఫేక్ అని చెప్పే విధంగా ఆయన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Suriya:సూర్యతో సినిమా.. స్టేజీపై రాజమౌళి అన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్..!

జబర్దస్త్ షో అంతా ఒక డ్రామా అంటూ..:

జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్స్ వేసినప్పుడు నవ్వు రాకపోయినా సరే బలవంతంగా నవ్వాలి అని, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు క్లోజప్ షాట్స్ తీస్తారని, అది ముందుగానే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని, అదంతా ఒక డ్రామా అని అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

అంతే కాదు కమెడియన్ కృష్ణ భగవాన్ ఎందుకు జబర్దస్త్ షోకి పిలిచినా కూడా వెళ్లడం లేదు అంటే ఆయన ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు అన్న విషయం పృథ్వీరాజ్ చెప్పారు.

కామెడీ లేకపోయినా కామెడీ చేస్తున్నారంటూ..:

అసలు కామెడీ రాకపోయినా సరే కామెడీ చేస్తున్నారు. అక్కడ ఉండే వాళ్లకు నవ్వు రాకపోయినా నవ్వమంటే ఎక్కడ నవ్వాలో అక్కడ ఉండేది వల్గర్ పంచ్‌లు మాత్రమే. నిజమైన కామెడీ చేసేవారు లేరు. “మనం ఎందుకు రా వెళ్లడం” అంటూ చెప్పారు అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

పృథ్వీరాజ్ జబర్దస్త్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

also read:Nani The Paradise:ప్యారడైజ్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!

జబర్దస్త్‌కు మళ్లీ పునర్ వైభవం రావాలంటున్న నెటిజన్లు:

కేవలం పృథ్వీరాజ్ మాత్రమే కాదు, చాలామంది కామన్ పీపుల్స్ కూడా జబర్దస్త్‌లో ఓవరాక్షన్ ఎక్కువైపోయిందని, కామెడీ పంచెస్ కన్నా కూడా వల్గర్ పంచెస్ ఎక్కువైపోయాయని, రూట్ మారిస్తే బాగుంటుందని అంటున్నారు. జబర్దస్త్‌కి మళ్లీ పునర్ వైభవం రావాలి అంటే ఒకప్పటిలా హెల్దీ స్కిట్స్ వేయాలి అని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you