Madhuri Rathod:యూట్యూబ్ లో జానపద పాటలతో గుర్తింపు సంపాదించుకున్న ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం పై రోజు రోజుకి ఏదో ఒక విషయం వైరల్ గా మారింది. గడచిన కొద్ది రోజుల క్రితం ఈశ్వర స్థాయి పైన కేసు పెట్టిన మాధురి రాథోడ్(Madhuri Rathod).. ఆదివారం రోజున ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. ముఖ్యంగా పెళ్లి అనే పేరుతో నమ్మించి వంచించడం ,పరువు తీసేలా వ్యవహారించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నిందితుడు పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బలవన్మరణానికి పాల్పడిన మాధురి రాథోడ్..
మాధురి తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకోగా.. కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో తలుపులు పగలగొట్టి మరి ఆమెను కాపాడడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది మాధురి రాథోడ్. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయి పైన ఫిర్యాదు చేసింది. తనని వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి మరి శారీరకంగా లొంగదీసుకుని మరీ నమ్మించి మోసం చేయడమే కాకుండా తనని టెక్నాలజీతో వీడియోలను మార్పులు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో తెలియజేసింది.
పట్టించుకోని పోలీసులు..
ఫిర్యాదు చేసి మూడు రోజులు అవుతూ ఉన్న అసలు నిందితుడిని గురించి పోలీసులు ఏమి పట్టించుకోలేదని పోలీసులు దర్యాప్తు నిర్లక్ష్యం చేస్తున్నారని , మానసికంగా కుంగుబాటుకు గురయ్యి ఈ ఆగాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్నారు. ఈశ్వర్ సాయికి వివాహమై ఒక బాబు ఉన్నప్పటికీ మాధురి రాథోడ్ తో కలిసి వేములవాడలో ఉన్న ఒక లాడ్జిలో ఈశ్వర్ సాయి భార్య కు అడ్డంగా దొరికారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాను వాష్ రూమ్ కోసమే మాధురి రూమ్ కి వెళ్ళాను అంటూ ఈశ్వర్ సాయి చెప్పినట్లుగా వీడియోలో చూపించినా ఎవరూ పట్టించుకోలేదు.
also read:Ameesha Patel:హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు కౌంటర్!
వాళ్లకు శిక్ష పడాలి.. నాకు న్యాయం జరగాలి..
మాధురి రాథోడ్ పై కూడా వేధింపులు మితిమీరడంతో ఆమె చట్టపరమైన న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.. వీరిద్దరూ కలిసి ప్రమీల ఓ ప్రమీల, బాసింగా బలాలే వంటి పాటలతో బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈశ్వర సాయి పరారీలో ఉన్నట్లుగా వినిపిస్తోంది. మాధురి రాథోడ్ సూసైడ్ లెటర్ లో తనకు సపోర్ట్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తాను తప్పు చేశానని , అందుకే బయట తన ముఖం చూపించలేకపోతున్నారని, తన కుటుంబ పరువు పోయిందని, తన చావుకి కారణం శరణ్య, సంధ్య, ఈశ్వర్ సాయి మరియు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన వాళ్లేనంటూ లెటర్లో తెలియజేసింది. వాళ్ళకి శిక్ష పడాలని, తనకు న్యాయం జరగాలని కోరింది మాధురి రాథోడ్.




