Trisha:”త్రిష”..ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయాలలోనే ఈ పేరు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో ఈమె పేరు చర్చినీయాంశంగా మారింది. ఎప్పుడైతే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారో.. అప్పట్నుంచి తమిళ పరిశ్రమతో పాటు రాజకీయాలలో కూడా త్రిష పేరు మారుమ్రోగిపోతుంది. విజయ్ సీఎం అవడానికి కారణం త్రిష అని కొందరు.. త్రిష వల్లే విజయ్ సీఎం అయ్యాడు అని మరికొందరు.. ఇలా త్రిష పేరుని హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
త్రిష రాజకీయాల్లోకి రానుందా?
మరీ ముఖ్యంగా రీసెంట్గా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష (Trisha)..ఆయనతో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడం ఇంకా ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి మూమెంట్లోనే త్రిషకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు తమిళ్ సినీ పరిశ్రమలో అదే విధంగా రాజకీయాలలో బాగా చర్చనీయాంసంగా మారింది. ఆమె త్వరలో రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాలలోను ఆసక్తిని పెంచేస్తుంది.
కథలు వినకుండానే రిజెక్ట్..
ఆమె నటించిన లేటెస్ట్ గా నటించిన సినిమా “కరుప్పు”. ఈ సినిమా విజయంతో త్రిషకు పలు కొత్త చిత్రాలల్లో నటించే అవకాశం వస్తున్నప్పటికీ ఆమె వాటిని అంగీకరించడం లేదని టాక్. పెద్దపెద్ద దర్శకులు కూడా త్రిషతో సినిమా చేయడానికి ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. త్రిష అసలు కథ కూడా వినకుండా రిజెక్ట్ చేసేస్తుందట. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆమె ఆరు సినిమాలకు పైగా రిజెక్ట్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టడం కోసమే ఆమె ఈ విధంగా మంచి మంచి సినిమాలను వదులుకుంటున్నారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయనుందా?
ముఖ్యంగా తిరుచ్చి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తిరుచ్చి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఉపందుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత తమిళ్ స్టార్ హీరో విజయ్(vijay) ఈ స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారు..?? అనే ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో త్రిష పేరు తెర పైకి రావడం విశేషంగా మారింది.
also read:Maa Inti Bangaram:’మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ వచ్చేశాయి..థియేటర్‌లో ఉంటే ఇంకో లెవల్ అయ్యేది..!
త్రిష స్పందిస్తుందా?
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు త్రిష స్పందించనేలేదు. అలాగే టీవీకే పార్టీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ త్రిష మాత్రం ఖచ్చితంగా “తిరుచ్చి” అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుంది అంటూ బలంగా నమ్ముతున్నారు. తమిళ జనాలు త్రిష నిజంగానే రాజకీయాలలోకి అడుగుపెడితే అది తమిళనాడు రాజకీయాలలోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలోనూ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
also read:Raksha Gowda:బుల్లితెర క్రష్ రక్షా గౌడ లైఫ్ జర్నీ: ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
అధికారిక ప్రకటన వచ్చేవరకు..
ఇప్పటికే తమిళ రాజకీయాలలో సినీ ప్రముఖుల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష కూడా అదే బాటలో నడుస్తారా..? లేదా..? ఆమె ఏదైనా సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారా..? అనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ విషయంపై త్రిష అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఈ ఊహగానాలు రోజురోజుకి ఎక్కువ అయిపోతాయి. త్రిష రాజకీయ ఎంట్రీ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.


