Friday, August 14, 2026
HomeLATESTMega 158:మెగా 158 టైటిల్ అదేనా?

Mega 158:మెగా 158 టైటిల్ అదేనా?

Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ పై ఇప్పుడు కొత్త చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Mega 158:టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిత్రాలకు సంబంధించి అప్డేట్ల కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగానే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రాబోతున్న మెగా 158 సినిమాకి సంబంధించి కూడా పలు రకాల అప్డేట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లేదా స్టోరీ అధికారిక ప్రకటన రాకముందే లీక్ అవ్వడం కూడా ఒక ట్రెండీగా మారిపోయింది. గతంలో చిరంజీవి సినిమాలకు సంబంధించి ఇదే విషయం జరిగింది. ఇప్పుడు తాజాగా 158వ(Mega 158) చిత్రం కూడా టైటిల్ విషయంపై ఒక న్యూస్ వైరల్ గా మారింది.

మెగా 158 టైటిల్ పై కొత్త చర్చ..

చిరంజీవి డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి కదిరి కాకాజీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా అభిమానులకు డబల్ ట్రీట్ ఇచ్చేలా నిమిషానికి పైగా నిడివి ఉన్న ఒక స్పెషల్ వీడియో ను కూడా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రతి సినిమా అనౌన్స్మెంట్ కు ముందు ఇలాంటి టైటిల్ లీకులు రావడం కూడా మెగా అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Fridya Movies:ఈ శుక్రవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానెల్‌లో ఏ మూవీ అంటే?

టైటిల్ అదేనా?

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బాస్టర్ విజయం తరువాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతోందని తెలిసి సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మరి ఆగస్టు 22వ తేదీన వచ్చే గ్లింప్స్ లో టైటిల్ ఏంటి అనే విషయానికి చెక్ పెడుతుందని చెప్పవచ్చు. ఇటీవలే కొరియన్ కనకరాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా థమన్ సినిమాకి సంబంధించి అన్ని పనులు జరుగుతున్నాయి అని టైటిల్ ని కూడా కదిరి అని చెప్పడంతో సినిమా టైటిల్ అదే అన్నట్టుగా అభిమానులు కూడా భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Vishal:విశాల్ ‘మకుటం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్: సినిమా హిట్టా.. ఫట్టా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..

అలాగే డైరెక్టర్ వశిష్టతో కలసి విశ్వంభర సినిమాని ఎప్పుడో మొదలుపెట్టినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి బర్త్డే రోజున ఏదైనా వస్తుందేమో చూడాలి మరి. వీటితో పాటుగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. చిరంజీవి బర్త్డే వేడుకలను కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించేలా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి బర్త్డే కానుకగా మెగా అభిమానులకు కూడా సర్ప్రైజ్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you