Friday, August 14, 2026
HomeLATESTPrabhas: ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే హీరో ఎవరో తెలుసా?

Prabhas: ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే హీరో ఎవరో తెలుసా?

Prabhas: ప్రముఖ హీరో ప్రభాస్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాలో అయ్యే తెలుగు హీరో ఎవరా అని ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. ముఖ్యంగా స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్2 తదితర చిత్రాల షూటింగ్లలో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ప్రభాస్ చివరిగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ చిత్రంలో నటించారు. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభాస్(Prabhas)అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ ఫాలో అయ్యే తెలుగు హీరో ఎవరంటే?

అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా అరుదుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు ప్రభాస్. కానీ తనకు సంబంధించిన ఎలాంటి విషయాలను అయినా సరే స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో తన సినిమా అప్డేట్లను ప్రకటించడమే కాకుండా ఇతర సినిమాలకు కూడా సపోర్టు చేస్తూ ఉంటారు ప్రభాస్ . ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ కు భారీగాని ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఏకంగా 13 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఒకే ఒక్క టాలీవుడ్ హీరో ఉన్నారు.

- Advertisement -
Advertisement

also read:Mega 158:మెగా 158 టైటిల్ అదేనా?

28 మందిలో వారే మెయిన్..

అయితే ఆ టాలీవుడ్ హీరో ఎవరా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ 28 మందిని మాత్రమే ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. వారిలో తనతో పని చేసిన హీరోయిన్స్ అలాగే ప్రముఖ డైరెక్టర్లు, అమితాబ్ బచ్చన్ , అనుపమ్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, కమలహాసన్ వంటి వారు మాత్రమే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో ఆయన పెదనాన్న దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకౌంట్ ను మాత్రమే ఫాలో అవుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Fridya Movies:ఈ శుక్రవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానెల్‌లో ఏ మూవీ అంటే?

కృష్ణంరాజు కెరియర్..

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎన్నో చిత్రాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మంచి సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. ప్రభాస్ తో కలిసి రెబల్, రాధే శ్యామ్ వంటి చిత్రాలలో కూడా కలిసి నటించారు కృష్ణంరాజు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు సైతం ప్రభాస్ కి స్నేహితుడిగా ఉన్నారు. ముఖ్యంగా గోపీచంద్, రానా ,మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా మంచి స్నేహబంధం కలదు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ వీరిలో ఏ ఒక్కరిని కూడా ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో కనిపించలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా ఫాలో అయ్యే వారి సంఖ్యను ప్రభాస్ పెంచుకుంటారేమో చూడాలి మరి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నప్పటికీ వారి ఆశలు నిరాశగానే మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/p/Da178WxS0ch/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you