Korean kanakaraju:టాలీవుడ్ మెగా హీరోలలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే కొరియన్ కనకరాజు(Korean kanakaraju). ఈ చిత్రాన్ని డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా.. ఆగస్టు ఏడవ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ కి జోడిగా రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్ సినిమా పైన ఉండే అంచనాలను పెంచేసింది.
కొరియన్ కనకరాజు నుండి ట్రైలర్ రిలీజ్..
తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా కొరియన్ కనకరాజు ట్రైలర్ ని విడుదల చేయగా అద్భుతంగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో సత్యా కామెడీ, వరుణ్ తేజ్ కామెడీ హైలెట్ గా నిలుస్తాయి. అద్వంతం వినోదాత్మకంగా కొరియన్ కనకరాజు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కొరియా బ్యాక్ డ్రాప్ లో హర్రర్ యాక్షన్ కామెడీ సినిమా అన్నట్లుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే మురళీధర్, సత్య, వరుణ్ తేజ్ కామెడీ మాత్రం హైలెట్ గా ఉంది.
ALSO READ:TV:’మా బోనాల జాతర’లో అసలు సర్‌ప్రైజ్ ఇదే.. అమూల్య-నిరంజన్ జంట వైరల్..!
అనంతపురం యువకుడిగా మాస్ లుక్కులో వరుణ్ తేజ్..
ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించిన బుల్లి రాజు కామెడీ కూడా ట్రైలర్లు మరింత ఆకట్టుకుంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ తో మాత్రం వరుణ్ తేజ్ ఆకట్టుకున్నారు. సినిమా కూడా సక్సెస్ అయ్యేలా ఉందంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ అనంతపురం యువకుడిగా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. మరొక పాత్రలో కొరియన్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Rana:రానా కొత్త ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్.. ఇంతగా మారిపోవడానికి కారణమేంటి?
చేతి కర్రతో మళ్ళీ కనిపించిన వరుణ్ తేజ్..
కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ ఈవెంట్ కి వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటికీ కూడా కర్ర సహాయంతోనే హాజరు కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన కాలికి గాయం అయ్యి ఉండి కూడా ఇంకా పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల వరకు సమయం పడుతుందట. దీంతో తదుపరి సినిమా షూటింగ్ కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు సైతం కోరుకుంటున్నారు.




