Thursday, May 7, 2026
HomeINTERVIEWSLavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

Lavanya Tripathi: ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో

on
banner Ad

Lavanya Tripathi: ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

‘సతీ లీలావతి’ మూవీని ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇక ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశాను.

Also Read: Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

ప్రతీ రోజూ షూటింగ్ అయిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. చిత్రీకరణలో చిన్న చిన్న గాయాలు అవ్వడం అనేది కామన్ కదా. అయితే ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తాను.

నేను ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసెజ్ ఉన్నా కూడా ఏదో బోధిస్తున్నట్టుగా, క్లాస్ పీకుతున్నట్టుగా అనిపించదు.

‘సతీ లీలావతి’లో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను.

నేను ప్రెగ్నెంట్ కదా? అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది.

Also Read: Jo Sharma: ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవాలి

రామ్ చరణ్ గారు మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఏమైనా హెల్ప్ చేయాలా? కావాలా? అని ఆయన అడుగుతుంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మాకు మరింత రీచ్ వచ్చింది.

దేవ్ మోహన్ గారు మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైన నటుడు. ఈ మూవీ కోసం డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉంటుంది.

చిరంజీవి గారు మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం.

ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. నేను నా ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నాను. నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.

Also Read: TV Movies: మే 7, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

సీనియర్ యాక్టర్ నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు ఇలా అందరూ అద్భుత పాత్రలు పోషించారు. చాలా ఎంటర్టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ గారి ‘సతీ లీలావతి’తో పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుంది. అదొక క్లాసికల్ చిత్రం. ఆ చిత్రంతో మా సినిమాని పోల్చకూడదు.

వరుణ్‌తో కలిసి నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలి. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తాం.

‘సతీ లీలావతి’ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you