Wednesday, July 29, 2026
HomeLATESTOTT Movie: భయపెట్టే కొరియన్ హారర్ మూవీ.. తెలుగు ఆడియోతో ఓటీటీ స్ట్రీమింగ్..!

OTT Movie: భయపెట్టే కొరియన్ హారర్ మూవీ.. తెలుగు ఆడియోతో ఓటీటీ స్ట్రీమింగ్..!

OTT Movie:హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అదిరిపోయే వార్త. సస్పెన్స్, భయానక సన్నివేశాలతో ఆకట్టుకున్న కొరియన్ హారర్ మూవీ ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

on
- Advertisement -banner Ad

OTT Movie:ప్రతి వారం మాదిరిగానే ఈ వీకెండ్‌ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలకు చెందిన పలు చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘దీవానా’, ‘రావు బహదూర్’ వంటి తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ‘అబ్జెషన్ మై లార్డ్’, ‘ఆజాదీ 501’, ‘హార్ట్ బీట్ సీజన్ 3’ వంటి వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.

ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొరియన్ హారర్ మూవీ:

అయితే ఈ సినిమాలు, సిరీస్‌ల కంటే ముందుగానే ఓ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 2024లో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉండటం విశేషం.

- Advertisement -
Advertisement

also read:Hyper Aadi:”పేదవాళ్లు మాత్రం అవ్వకండి సర్”.. నాగబాబుకు హైపర్ ఆది ఉచిత సలహా..!

ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ:

కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరమైన కథనం, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఊహించని ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా ప్రభావం, లైక్స్‌, వ్యూస్ కోసం మనుషులు తీసుకునే ప్రమాదకర నిర్ణయాలను ఈ సినిమా ప్రధానంగా చూపిస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Ramayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ!

యూట్యూబర్ చుట్టూ తిరిగే కథ:

ఈ సినిమా కథలో ఓ యూట్యూబర్ హారర్, సూపర్ నేచురల్ అంశాలపై వీడియోలు చేస్తుంటుంది. కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాదు. వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో భయంకరమైన రూమర్స్ ఉన్న ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ స్టేషన్ మాస్టర్ చెప్పే కొన్ని వింత కథలు ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి.

- Advertisement -
Advertisement

ఆ స్టేషన్‌లో ఎదురయ్యే భయానక అనుభవాలు, రహస్య పరిణామాలు ఆమెను ప్రమాదంలో పడేస్తాయి. వ్యూస్ కోసం వెళ్లిన ఆమె చివరకు ఆ ఘోస్ట్ ట్రైన్ మిస్టరీ నుంచి ఎలా బయటపడింది అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.‘ఘోస్ట్ ట్రైన్’ (ghost train)పేరుతో తెరకెక్కిన ఈ కొరియన్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో (OTT Movie)స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. 2024లో ప్రేక్షకులను భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you