Wednesday, August 12, 2026
HomeLATESTBigg Boss-10:బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఆసక్తికర పరిణామాలు.. జడ్జీలకే కౌంటర్లు ఇచ్చిన కంటెస్టెంట్లు..!

Bigg Boss-10:బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఆసక్తికర పరిణామాలు.. జడ్జీలకే కౌంటర్లు ఇచ్చిన కంటెస్టెంట్లు..!

Bigg Boss-10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కామనర్లకు అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష 2 కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss-10:బిగ్బాస్ తెలుగు సీజన్ 10 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఈసారి కామనర్లకు అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కామనర్లుగా వచ్చిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల బిగ్ బాస్(Bigg Boss-10) టైటిల్ గెల్చుకోవడంతో ఈసారి ఎంపికయ్యే కంటెస్టెంట్లపై మరింత ఆసక్తి నెలకొంది.

25 వేల అప్లికేషన్లు..70 మందికి ఆడిషన్స్:

అగ్ని పరీక్ష 2 కోసం దాదాపు 25వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వాటిలో నుంచి నిర్వాహకులు 70 మందిని ఆడిషన్స్ కి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. టాస్కులు , ప్రశ్నలు, ప్రత్యేక ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను పరీక్షిస్తున్నారు. పలు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగునుంది. చివరకు 10 నుంచి 15 మందిని షార్ట్ లిస్ట్ చేసి వారిలో ముగ్గురు లేదా ఐదుగురికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

- Advertisement -
Advertisement

జడ్జిలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ :

అగ్నిపరీక్ష 2కు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి హోస్ట్ గా కొనసాగుతున్నారు. కంటెస్టెంట్ లో ప్రతిభను పరీక్షించడంతోపాటు వారి వ్యక్తిత్వాన్ని అంచన వేసేందుకు జడ్జీలు ఆసక్తికరమైన ప్రశ్నలు ..టాస్కులు..ఇస్తున్నారు. ప్రోమోలోనే ఈ ఎపిసోడ్ లు వినోదంతో పాటు ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

also read:Trisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..!

- Advertisement -
Advertisement

జడ్జిలను మోసం చేయబోయాడా..?

తాజా ప్రోమో లో ఓ కంటెస్టెంట్ జడ్జిలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఈ విషయాన్ని శ్రీముఖి గుర్తించి అతడిని ప్రశ్నించింది. “మమ్మల్ని మోసం చేస్తావా..?” అంటూ ఘాటుగా స్పందించింది. చివరికి అతడికి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

also read:Bigg Boss:బిగ్ బాస్‌ 10పై బాలు సంచలన క్లారిటీ.. ఫ్యాన్స్‌కు అసలు విషయం చెప్పేశాడు..!

- Advertisement -
Advertisement

అభిజిత్ కు కంటెస్టెంట్ కౌంటర్:

మరో కంటెస్టెంట్ ఏకంగా అభిజిత్ కే కౌంటర్ ఇచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఆయన కొన్నేళ్లపాటు పెద్దగా కనిపించలేదని వ్యాఖ్యానించాడు. దీనిపై అభిజిత్ కూడా గట్టిగానే స్పందించాడు. “మాకు వేరే పని లేదని అనుకుంటున్నావా..?” అంటూ ప్రశ్నించాడు. చివరకు ఆ కంటెస్టెంట్ కి కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది .

రివర్స్ లో తెలుగు రాసిన కంటెస్టెంట్ :

రాకుమారి డయానా అనే కంటెస్టెంట్ తన ప్రత్యేక ప్రతిభతో జడ్జిలను ఆకట్టుకుంది. ఆమె తెలుగు అక్షరాలను రివర్స్ లో రాయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అద్దంలో చూసినా అక్షరాలు సరిగా కనిపించేలా రాయడం విశేషంగా నిలిచింది. ఆమె టాలెంట్ ని చూసి నవదీప్ సైతం ఆశ్చర్యపోయినట్లు ప్రమోలో కనిపించింది.

బిగ్బాస్ సీజన్ 10 లోకి వచ్చే సెలబ్రెటీల పేర్లపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీపికా రంగరాజు, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ రాకేష్, హరి, పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ, వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరి ఎంట్రీ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇవి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పేర్లు మాత్రమే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you