Tuesday, May 19, 2026
HomeVIDEOSPeddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.

on
banner Ad

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ (Peddi Trailer)ను సోమవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో లాంచ్ చేశారు.

యువతకు హీరో (Peddi Trailer)

రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ ట్రైలర్‌లా కాకుండా.. ‘పెద్ది’ ట్రైలర్ ఒక పల్లె ప్రపంచాన్ని, అక్కడి జీవితాల్ని, పోరాటాన్ని, ఆటపై ఇష్టాన్ని ఎంతో సహజంగా పరిచయం చేసింది. పెద్ది అనే పాత్ర ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్. క్రికెట్, కుస్తీ, రన్నింగ్… ఏ ఆట అయినా తన శక్తితో నెగ్గే ఆటగాడు. అక్కడి యువతకు హీరోలా కనిపించే పెద్ది.. గ్రామస్తుల గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు. అయితే అతని ఎదుగుదల ఒక ఆధిపత్య వర్గానికి నచ్చదు. అక్కడి నుంచి కథ అసలైన సంఘర్షణలోకి వెళ్తుంది.

Also Read- TV Movies: మే 19, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

ఒక ప్రపంచం

బుచ్చిబాబు సానా పెద్ది లార్జర్ దెన్ లైఫ్ ప్రపంచాన్ని తీర్చిదిద్దన తీరు ట్రైలర్‌లో అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌కి ఒక ఎమోషన్ ఉంది. ట్రైలర్ మొత్తం హార్ట్‌బీట్‌లా అనిపిస్తుంది.. నిశ్శబ్ద క్షణాల్లో సున్నితంగా, యాక్షన్ సన్నివేశాల్లో ఉరుములా బ్లాస్ట్‌లా పేలింది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఆట, బతుకు, పోరాటం అన్నీ కలిసిన ప్రపంచం. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కేర్‌తో డిజైన్ చేయడంతో ప్రేక్షకులని ఎమోషన్‌తో నిండిన ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై జరిగే భారీ ఘర్షణలు, గాల్లో ఎగిరే స్టంట్స్, మట్టిలో జరిగే కుస్తీ పోరాటాలు.. ప్రతి యాక్షన్ బ్లాక్ కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రికెట్, కుస్తీని కలిపి డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

న్యూ అవతార్‌లో..

రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతార్‌లో అదరగొట్టారు. ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, అథ్లెటిక్ ప్రెజెన్స్ అన్నీ కూడా పాత్రకు అద్భుతంగా సరిపోయాయి. ఒకవైపు ఫ్లడ్‌లైట్స్ కింద రఫ్ బ్యాట్‌తో క్రికెట్ ఆడే పెద్ది.. మరోవైపు మట్టిలో కుస్తీ పోరాటాల్లో దిగే పెద్ది.. ఈ రెండు షేడ్స్‌లో చరణ్ అద్భుతంగా కనిపించారు. ఇది కేవలం లుక్ మార్పు కాదు.. పూర్తిగా పాత్రలో లీనమై చేసిన పెర్ఫార్మెన్స్ అని ట్రైలర్ స్పష్టం చేసింది.

ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్

జాన్వీ కపూర్ తన పాత్రలో ఎంతో నేచురల్‌గా కనిపించింది. గ్రామీణ యువతిగా ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ట్రైలర్‌కు మంచి వార్మ్‌నెస్ తీసుకొచ్చాయి. అలాగే శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ పాత్రలు కూడా కథలో బలమైన ప్రాధాన్యం కలిగి ఉన్నాయని ట్రైలర్ సూచించింది. టెక్నికల్‌గా ‘పెద్ది’ మరో స్థాయిలో కనిపిస్తోంది. అవినాష్ కొల్లా రూపొందించిన పెద్ది ప్రపంచం అద్భుతంగా వుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద అసెట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్ విజువల్స్, డైనమిక్ కెమెరా మూమెంట్స్ కట్టిపడేశాయి.

Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్

ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ఆత్మలా నిలిచింది. ఎమోషన్స్‌ను, యాక్షన్‌ను ఒకేసారి ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ ట్రైలర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో నిర్మించిన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా బిగ్ స్క్రీన్ అనుభూతిని కలిగిస్తోంది. ప్రేక్షకులను పూర్తిగా లీనం చేసే ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండగా.. ట్రైలర్‌తో ‘పెద్ది’పై అంచనాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you