Friday, June 19, 2026
HomeLATESTSamantha:సమంత మా ఇంటి బంగారం "స్పెషల్ షో".. ఫస్ట్ రివ్యూ వైరల్!

Samantha:సమంత మా ఇంటి బంగారం “స్పెషల్ షో”.. ఫస్ట్ రివ్యూ వైరల్!

Samantha: నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నటించిన మా ఇంటి బంగారం సినిమా రేపు థియేటర్లలో విడుదల నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Samantha:నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మా ఇంటి బంగారం అనే సినిమాతో జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా జూన్ 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక జూన్ 19న అనగా రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ పెద్దల కోసం మా ఇంటి బంగారం సినిమా స్పెషల్ షో వేసినట్లు సమాచారం.

సెన్సార్ పూర్తీ.. స్పెషల్ షో..

అంతేకాదు ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది. 2 గంటల 34 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సమంత మా ఇంటి బంగారం సినిమా ఎలా ఉంది? సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

మా ఇంటి బంగారం సినిమా కథ..

ముందుగా మా ఇంటి బంగారం సినిమా కథ విషయానికి వస్తే.. సమంత (Samantha)పెళ్లి చేసుకొని ఒక గ్రామంలోని సాంప్రదాయ కుటుంబానికి కోడలిగా వెళుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ ఫ్యామిలీ వాళ్ళంతా సమంతను కొత్తగా చూడడం .. ఆమె ఇంటి కోడలు అంటే అన్ని పనులు చేయాలని చెప్పడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఆ ఇంటి చిన్న కోడలైన శ్రీముఖిని(Sreemukhi) ఆదర్శంగా చూపిస్తూ.. సమంత ఇలాగే ఉండాలి అని ఆమెతో ఆ కుటుంబ సభ్యులు చెప్పడం.. పైగా శ్రీముఖి – సమంతా మధ్య వచ్చే సన్నివేశాలు.. ఫ్యామిలీ సీన్స్ తో చాలా సింపుల్ గా అక్కడక్కడ కామెడీగా సాగుతుందట. ఇంటర్వెల్ సమయానికి తన గతం తాలూకు వ్యక్తులు రావడం.. సమంతాను ఇబ్బంది పెట్టడంతో ఒక యాక్షన్ సీక్వెన్స్ తో అసలు సమంతా ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి నెలకొంటుంది.

also read:Vijay Deverakonda:చిక్కుల్లో పడ్డ విజయ్ దేవరకొండ.. టీసీఏ ఫైర్!

- Advertisement -

సెకండ్ హాఫ్ లో అదరగొట్టేసిన సమంత..

ఇక కట్ చేస్తే సెకండ్ హాఫ్ లో సమంత ఒక దళంలో పనిచేసినట్టు చూపిస్తారు. అసలు దళంలోకి ఎందుకు వెళ్ళింది ?గన్ ఎందుకు పట్టుకుంది ? గుల్షన్ దేవయ్య ఆమెకు ఎలా పరిచయమయ్యారు? ఆ దళం వదిలేసే ఆమె ఎందుకు వచ్చింది? మళ్ళీ గుల్షన్ దేవయ్య సమంత లైఫ్ లోకి వస్తే ఏం చేసింది? అసలు సమంతా గురించి తెలిసి ఆమె భర్త కుటుంబం వాళ్ళు ఏం చేశారు? అనేది చాలా ఆసక్తిగా తెరకేక్కించారు. అక్కడక్కడ కామెడీ, కొంత సాగదీతతో నడిపించి ఇంటర్వెల్ కి బాషా రేంజ్ లో ఊహించనిటిస్ట్ ఇచ్చారు. సమంతకు తోడికోడలి పాత్రలో శ్రీముఖి ఒదిగిపోయిందని సమాచారం.

also read:Peddi Movie:పెద్దిలో కొత్త సీన్స్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్.. కలిసొస్తుందా?

- Advertisement -

థియేటర్లలో రేపే సందడి..

ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) చెప్పినట్టు కలిసుందాం రా, బాషా సినిమాలను మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో మా ఇంటి బంగారం సినిమా అలాగే ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉందో తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you