Theatre/OTT Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లో కొత్త కొత్త చిత్రాలు, సిరీస్ లు ఏవేవి ఉన్నాయా అని ఎదురుచూసే అభిమానులు చాలామంది ఉంటారు. ఇక ఎప్పట్లాగే ఈ జూన్ మూడవ వారం కూడా ఇటు థియేటర్ ప్రేక్షకులను అటు ఓటీటీ ప్రియులను అలరించడానికి కొన్ని చిత్రాలు, స్పెషల్ సిరీస్ లు సిద్ధమయ్యాయి. మరి ఈ మేరకు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ఏ ఏ చిత్రాలు , వెబ్ సిరీస్ లు అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో ఆకట్టుకోబోతున్న చిత్రాలు..
మా ఇంటి బంగారం:
సమంత లీడ్ రోల్ పోషిస్తూ.. ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో జూన్ 19వ తేదీన అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మా ఇంటి బంగారం. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా.. రన్ టైం కూడా లాక్ చేసుకుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అటు సమంత కి తెలుగులో మళ్లీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా కూడా ఇదే రోజున విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ తేదీ నుండి ఈ సినిమా తప్పుకుంది.కాబట్టి ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా మరో సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చేటట్టు కనిపిస్తోంది. ఏదేమైనా సింగిల్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
దీవానా..
మరోవైపు హర్షిత్ రెడ్డి , స్నేహ మణి మేఖలై జంటగా నటించిన కొత్త తెలుగు చిత్రం దీవానా. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది . కానీ సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మేకర్స్ ఈ సినిమాను జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
also read:Samantha:సమంత మా ఇంటి బంగారం “స్పెషల్ షో”.. ఫస్ట్ రివ్యూ వైరల్!
ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, సీరీస్ లు ఇవే..
నెట్ ఫ్లిక్స్:
ఐ విల్ ఫైండ్ యు (హాలీవుడ్ మూవీ) – జూన్ 18
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లే (హాలీవుడ్ సినిమా ) – జూన్ 19
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (కొరియన్ మూవీ) – జూన్ 19
జియో హాట్ స్టార్:
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (వెబ్ సిరీస్) – జూన్ 19
అమెజాన్ ప్రైమ్:
దృశ్యం 3 (మలయాళం మూవీ) – జూన్ 18
ది ఎజెన్సీ సీజన్ 2 (వెబ్ సిరీస్) – జూన్ 21
లయన్స్ గేట్ ప్లే:
అలియా బసు గాయబ్ హై (బాలీవుడ్ మూవీ) – జూన్ 19
మోటివ్ ఫర్ మర్డర్ (తెలుగు సినిమా) – జూన్ 19
సోనీ లివ్:
అతిరథీ (మలయాళ సినిమా) – జూన్ 19
also read:Peddi Movie:పెద్దిలో కొత్త సీన్స్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్.. కలిసొస్తుందా?


