Sunday, June 21, 2026
HomeLATESTTransfer Trimurthulu:ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ.. 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ వర్కౌట్ అయిందా?

Transfer Trimurthulu:ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ.. 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ వర్కౌట్ అయిందా?

Transfer Trimurthulu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వడ్డే నవీన్ మెప్పించారా అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

on
- Advertisement -banner Ad

Transfer Trimurthulu:ఒకప్పుడు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. స్టార్ హీరోలుగా , హీరోయిన్ లుగా ఆకట్టుకున్న ఎంతోమంది సెలబ్రెటీలు.. రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రీఎంట్రీలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ గా సినిమాలు చేస్తుంటే.. మరికొంతమంది మళ్లీ హీరోలుగా అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రీ ఎంట్రీ అందరికీ వర్కౌట్ అవుతోందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొంతమంది రీఎంట్రీలో మంచి కం బ్యాక్ అందుకుంటే.. మరి కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోలేక మళ్ళీ చతికిల పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు వడ్డే నవీన్. మరి ఈ రీ ఎంట్రీ ఆయనకు వర్కౌట్ అయ్యిందా? ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించారు? మునుపటి వైభవం ఆయనకు లభించిందా ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

సినిమా కథ:

నిజాయితీకి మారుపేరైన కానిస్టేబుల్ త్రిమూర్తులు తరచూ బదిలీలు ఎదుర్కొంటూ తన విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే ఒక బదిలీ కారణంగా తన తండ్రి పని చేసిన పాత పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అతనికి చాలా ఏళ్ల క్రితం జరిగిన గిరిజన యువతి ప్రియమ్మ అత్యాచార కేసుకు సంబంధించిన ఫైలు ఒకటి దొరుకుతుంది. ఆ కేసు వెనుక హోంమంత్రి కమల కుమారుడు సంతోష్ బాబు ఉన్నాడని తెలుసుకున్న త్రిమూర్తులు తన తండ్రి అసంపూర్తిగా మిగిలిపోయిన పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రియమ్మకు న్యాయం చేయడానికి ఎలా పోరాడాడు అన్నదే మిగిలిన కథ.

- Advertisement -

also read:Bigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

సినిమా విశ్లేషణ:

ఈ సినిమా ఎలా ఉందంటే.. దాదాపు 10 ఏళ్ల తర్వాత విరామం తీసుకుని మళ్ళీ హీరోగా తిరిగి వచ్చిన వడ్డే నవీన్(Vadde Naveen) ఈసారి సినిమాను తన భుజానపైన వేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, పోలీసు వ్యవస్థలోని ఒత్తిళ్లు వంటి అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మేళవిస్తూ కథను రూపొందించారు. ముఖ్యంగా సినిమా మొదట్లోనే ప్రియమ్మ ఘటనతో కథలో సీరియస్ టోన్ నెలకొంటుంది. ఆ తర్వాత త్రిమూర్తులు పాత్ర పరిచయం, అతని నిజాయితీ కారణంగా ఎదురయ్యే బదిలీలు, కుటుంబ సభ్యుల మద్దతువంటి అంశాలను చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది.

- Advertisement -

ప్లస్ పాయింట్స్:

నవీన్ తెరపై అందంగానే కనిపించాడు.. సినిమాను తన భుజాలపై మోసాడు.

హీరోయిన్ రాసి సింగ్ తెరపై కనిపించేది కాసేపైనా.. బాగా నటించింది.

- Advertisement -

సీఎం పాత్రకి శిల్పా పూర్తి న్యాయం చేసింది.

మిగతా నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

నేపథ్య సంగీతం పర్వాలేదు.

also read:Spirit Movie:వివాదంలో స్పిరిట్.. అన్యాయం చేశారంటూ మహిళ రైతు ఆవేదన!

మైనస్ పాయింట్స్:

హీరోతో డాన్స్ చేయించి పొరపాటు చేశారని తెలుస్తుంది.

సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే అని చెప్పాలి.

ఎడిటర్ ఇంకా తన కత్తెరకు పని చెప్పాల్సింది అనిపిస్తుంది.

క్రిస్పీగా కట్ చేసి ఉంటే సినిమా మరోలా ఉండేది.

చివరిగా:

ఏది ఏమైనా నవీన్ తన రీ ఎంట్రీలో ఇంకా కాస్త గట్టిగా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రేటింగ్:

1.5/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you