Monday, June 22, 2026
HomeLATESTAamir Khan : మూడో పెళ్లి ప్రకటన చేసిన మిస్టర్ పర్ఫెక్ట్.. పెళ్లెప్పుడు అంటే?

Aamir Khan : మూడో పెళ్లి ప్రకటన చేసిన మిస్టర్ పర్ఫెక్ట్.. పెళ్లెప్పుడు అంటే?

Aamir Khan : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ తాజాగా మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

on
- Advertisement -banner Ad

Aamir Khan : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్(Aamir Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు భాషతో సంబంధం లేకుండా పలు భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఈయన వారసుడు జునైద్ ఖాన్ కూడా ఏక్ దిన్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

మూడో పెళ్లి ప్రకటన చేసిన అమీర్ ఖాన్..

అయితే ప్రస్తుతం ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలవడం గమనార్హం. తాజాగా తాను మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని, భార్యలు ఇద్దరికీ విడాకులు ఇచ్చి , గౌరీ స్ప్రాట్ తో గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినా.. పిల్లల కోసం వారితో కలుస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి ఈయన తాజాగా మూడో పెళ్లి ప్రకటన చేయడంతో అందరూ వివాహం ఎప్పుడు అనే కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

సింపుల్ గా పెళ్లి..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా తన ప్రియురాలు గౌరీ(Gauri)ని వివాహం చేసుకోబోతున్న విషయాన్ని ఆయన ఓపెన్ గా తెలిపారు. ఈ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరుగుతుందని స్పష్టం చేశారు. “రిజిస్టర్ వివాహం చేసుకుంటాము.. పైగా ఇరు కుటుంబాల వాళ్లతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరగబోతోంది. మేమిద్దరం దీనిని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం” అంటూ ఆయన స్పష్టం చేశారు.

also read:Bhagya sree: భాగ్యశ్రీ పెళ్లి రామ్ తోనేనా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!

- Advertisement -

అభిమానుల మాటలను నిజం చేస్తూ..

ఇకపోతే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ జూలై 5న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించగా.. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమే. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. తిరిగి వచ్చాక ఆ తేదీనే వివాహం చేసుకోబోతున్నాం అంటూ తెలిపారు. అభిమానులు అనుకుంటున్నట్టుగానే జులై 5వ తేదీన వీరిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

also read:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత!

- Advertisement -

గౌరీ స్ప్రాట్ బ్యాక్ గ్రౌండ్..

ఈ నేపథ్యంలోనే గౌరీ స్ప్రాట్ గురించి మరోసారి చర్చకు వచ్చింది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే.. ఈమె బెంగళూరులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు బ్రిటిష్, ఐరిష్ మూలాలు ఉన్నవారు. ఇక ఈమె బ్లంట్ అనే సెలూన్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. పైగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ కోసం కూడా పనిచేస్తున్నారు. పైగా ఈమెకు మొదటి భర్త నుంచి విడాకులు కాగా ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈమెతో అమీర్ ఖాన్ పెళ్లికి సిద్ధమవుతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you