Monday, July 6, 2026
HomeLATESTBandla Ganesh:బండ్ల గణేష్ కేసులో ట్విస్ట్.. ఆస్తి వేలంపై హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

Bandla Ganesh:బండ్ల గణేష్ కేసులో ట్విస్ట్.. ఆస్తి వేలంపై హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

Bandla Ganesh:నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆస్తి వేలం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో కేసు కొత్త దిశలోకి వెళ్లింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Bandla Ganesh:సినీ నిర్మాత బండ్ల గణేష్ కు చెందిన జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు విలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటీషన్ను అనుమతిస్తూ సర్ఫేసీ చట్టం 2002 ప్రకారం బ్యాంకు చేపట్టిన ఆస్తి వేలం చట్టబద్ధమైన పని అని స్పష్టం చేసింది. దీంతో వేలాన్ని రద్దు చేస్తూ రుణవసూల ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది .

బ్యాంక్ వాదనలు ఏమిటి?

బ్యాంకు తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ప్రకారం.. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీ దారులుగా ఉన్నారు. రుణబకాయిల వసూళ్లలో భాగంగా 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకొని.. 2022లో నిర్వహించిన వేలంలో 8.51 కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. కంపెనీపై దివాళా ప్రక్రియ ప్రారంభమైనంత మాత్రాన వ్యక్తిగత గ్యారంటర్ల ఆస్తులకు మారటోరియం వర్తించదని కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం బ్యాంక్ చర్యలను సమర్థించింది.

- Advertisement -

also read:Tollywood: బాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేస్తున్న గీతా గోవిందం డైరెక్టర్!

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: బండ్ల గణేష్

హైకోర్టు తీర్పు పై బండ్ల గణేష్(Bandla Ganesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆస్తిని మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. డిఆర్టి లో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడం నిరాశ కలిగించిందన్నారు. అయితే భారత న్యాయ వ్యవస్థ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు.

- Advertisement -

also read:OTT Movies:ఓటీటీలోకి వచ్చిన ప్రేమలు హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ!

గతంలోనూ చట్టపరమైన వివాదాలు:

బండ్ల గణేష్ గతంలో కూడా పలు ఆర్థిక చెక్ బౌన్స్ కేసుల్లో వార్తల్లో నిలిచారు. టెంపర్ చిత్రానికి రచయితగా పనిచేసిన వక్కంతం వంశీకి ఇవ్వాల్సిన పారితోషికానికి సంబంధించిన చెక్ బౌన్స్ కావడంతో ఆయనపై కేసు నమోదయింది కోర్టు ..శిక్షతో పాటు జరిమాను కూడా విధించింది. అనంతరం బెయిల్ పొందారు. అలాగే కడప జిల్లాకు చెందిన ఒక ఫైనాన్షియర్ కు ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో కోర్టు విచారణ ఎదుర్కొన్నారు బండ్ల గణేష్. ఈ పరిణామాల మధ్య తాజా హైకోర్టు తీర్పు మరోసారి బండ్ల గణేష్ పేరు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you