SS Rajamouli :భారతీయ సినీ పరిశ్రమలో దర్శకధీరుడు “ఎస్ఎస్ రాజమౌళి” పేరు ప్రత్యేకంగా నిలిచింది. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించే దర్శకుడుగా గుర్తింపు పొందిన రాజమౌళి పారితోషకం విషయంలో కూడా ఇతర దర్శకులకంటే భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలలో ఆయన తన రెమ్యూనరేషన్ విధానం గురించి చెప్పి అందరి మైండ్ బ్లాక్ చేసేసారు.
ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ కు దూరంగా:
సాధారణంగా స్టార్ దర్శకులు సినిమా ప్రారంభానికి ముందే భారీ మొత్తాన్ని పారితోషకంగా తీసుకుంటారు. అయితే రాజమౌళి(SS Rajamouli )మాత్రం ముందుగానే భారీ ఫీజు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. సినిమా విజయవంతమైన లాభాలు వచ్చిన తర్వాత అందులో తనకు నిర్ణయించిన వాటాను తీసుకునే విధానాన్ని ఆయన ఎక్కువగా అనుసరిస్తారు. కొన్ని ప్రాజెక్టులకు వ్యక్తిగత ఖర్చులకోసం అవసరమైన మొత్తాన్ని మాత్రమే తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
also read:TV:హైదరాబాద్ అమ్మాయి నుంచి స్టార్ యాక్ట్రెస్‌గా.. వందన గొల్లు సక్సెస్ స్టోరీ ఇదే!
బాహుబలితో లాభాల్లో భారీ వాటా :
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి సిరీస్ కు కూడా రాజమౌళి ఫిక్స్డ్ పారితోషకం తీసుకోలేదని సమాచారం. ప్రాజెక్టుపై పూర్తి నమ్మకంతో సినిమా పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా విడుదల అనంతరం వచ్చిన లాభాల్లో వాటా పొందేల ఒప్పందం చేసుకున్నారు. అదే విధానం తర్వాత వచ్చిన “ఆర్ఆర్ఆర్” కు కూడా కొనసాగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసికి కూడా ఇదే మోడల్ అమలవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
also read:Pavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!
నిర్మాతలతో దీర్ఘకాల అనుబంధానికి కారణం:
రాజమౌళి తరచు ఒకే నిర్మాతలతో పనిచేయడానికి ప్రధాన కారణం పరస్పర నమ్మకమే. ఆయన విజయం పై నిర్మాతలకు పూర్తి విశ్వాసం ఉండడంతో సృజనాత్మక నిర్ణయాలలో ఎలాంటి జోక్యం ఉండదు. అలాగే ప్రతి ఖర్చు పై స్పష్టమైన లెక్క నిర్వహించడం వల్ల ఆర్థిక వివాదాలకు కూడా అవకాశం ఉండదు. ఈ పారదర్శకత వారి మధ్య బలమైన అనుబంధానికి కారణమైంది.
కుటుంబమే రాజమౌళి బలం:
రాజమౌళి సినిమాల విజయాలలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి.. కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి.. రచయిత వల్లి.. కార్తికేయ.. తదితరులు నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు అవుతుంటారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ సినిమా విజయాన్ని లక్ష్యంగా పెట్టుకునే రాజమౌళి పని విధానమే ఆయనను ప్రపంచ స్థాయి దర్శకుడుగా నిలబెట్టిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




