Priyanka Jain:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ సుపరిచితమే. ఆమె కి హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఆమె అంటే పడి చచ్చిపోయే జనాలు కూడా ఎక్కువే. షోలో తన స్పష్టమైన అభిప్రాయాలు, ధైర్యమైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక, బిగ్‌బాస్ అనంతరం టెలివిజన్ కార్యక్రమాలు, మ్యూజిక్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువవుతోంది.
ప్రియుడితో హాట్ వీడియో సాంగ్:
తాజాగా ప్రియాంక జైన్ తన ప్రియుడు, నటుడు శివకుమార్‌తో కలిసి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న యష్ నటించిన టాక్సిక్ చిత్రంలోని ‘తబాహి’ పాటను వీరిద్దరూ రీక్రియేట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రియాంక గ్లామర్ లుక్, ఇద్దరి రొమాంటిక్ ప్రెజెంటేషన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ALSO READ:Balakrishna :మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్య కుమార్తె ఎంట్రీ?
నెటిజన్ల నుంచి ఆసక్తికర స్పందన:
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు యష్, కియారా అద్వానీ చేసిన ఒరిజినల్ వెర్షన్‌ను గుర్తు చేస్తూ, ప్రియాంక–శివకుమార్ జోడీ కూడా అద్భుతంగా కనిపించిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇద్దరి సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు నువ్వు ట్రెడిషినల్ గా ఉంటేనే బాగున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా వేదికల్లో వేగంగా వైరల్ అవుతోంది.
ALSO READ:TV:టీవీ ప్రేక్షకులకు పండగే.. శుక్రవారం ప్రసారమయ్యే బ్లాక్‌బస్టర్ సినిమాల జాబితా ఇదే!
సహజీవనంపై స్పష్టత ఇచ్చిన జంట:
ప్రియాంక జైన్, శివకుమార్ తమ వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మౌనరాగం సీరియల్ ఆడిషన్స్ సమయంలోనే తొలిసారి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమలో పడ్డామని తెలిపారు. తమ మధ్య సినిమా తరహా ప్రపోజల్స్ ఏవీ జరగలేదని, పరస్పర నమ్మకం, కేరింగ్ కారణంగానే బంధం బలపడిందని చెప్పారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విషయాన్ని కూడా వారు దాచకుండా వెల్లడించారు. తమ నిర్ణయంపై ఎవరు ఎలా స్పందించినా పట్టించుకోమని, పరస్పర గౌరవం, అవగాహనతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
https://www.instagram.com/reel/DbapcB5z7Wc/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




