Rashmika mandanna:టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక గురించి ప్రత్యేకించి తెలియజేయాల్సిన పనిలేదు. తనదైన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ప్రేమించి వివాహం చేసుకున్న రష్మిక వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది. ఇటువంటి తరుణంలోని రష్మికకు తీవ్రమైన గాయమైనట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.
రష్మికకు గాయం..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక(Rashmika mandanna) మైసా, రణబాలి వాటి సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది. ఈ చిత్రాలలోని యాక్షన్ సన్నివేశాలు, డాన్స్ సీక్వెల్స్ కోసం నిరంతరం శ్రమిస్తోంది రష్మిక. ఇటువంటి సందర్భంలోనే రష్మిక హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయమైనట్లుగా సమాచారం. వైద్యులు తెలుపుతున్న సమాచారం ప్రకారం.. రష్మిక హిప్ ఏరియాలో టెండన్ పూర్తిగా డిటాచ్మెంట్ కావడంతో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలియజేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి గాయాలు కేవలం శారీరక శ్రమ చేసేటటువంటి క్రీడాకారులలోనే ఎక్కువగా కనిపిస్తాయని తెలియజేస్తున్నారు.
also read:Pragya Jaiswal: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న ప్రగ్యా జైస్వాల్!
ఆరు వారాలపాటు విశ్రాంతి..
గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం రష్మిక సుమారుగా ఆరు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుత జరుగుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రష్మిక గాయం కారణం చేత షూటింగ్ లకి మరి కొంతకాలం దూరంగా ఉండాల్సి ఉంటుందని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రష్మిక సరైన చికిత్స చేయించుకోవాలని విశ్రాంతి ఎక్కువగా తీసుకుని తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
also read:Ram Gopal Varma:సీక్రెట్ గా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ఆర్జీవి
షూటింగ్ లన్నీ వాయిదా?
అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు అటు రష్మిక టీం కానీ విజయ్ దేవరకొండ కాని ఏ విధంగా స్పందించలేదు. మరి అభిమానుల కోరిక మేరకు ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇప్పటికే రష్మికకు సుమారుగా 30 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది .ఈ ప్రమాదం కారణం చేత పలు యాడ్స్ షూటింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం రష్మికకు సంబంధించి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




