Sunday, August 2, 2026
HomeLATESTJabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!

Jabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!

జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, అలాగే జబర్దస్త్ షోలోని స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Jabardasth:జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన సమస్యలను ఎవరికీ చెప్పుకునే అలవాటు లేదని, కుటుంబ సభ్యులకు కూడా తన ఇబ్బందులు తెలియనివ్వనని వెల్లడించారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు తానే ముందుంటానని, కానీ తన బాధలను మాత్రం తనలోనే దాచుకుంటానని చెప్పారు. ఇటీవల నడుముకు శస్త్రచికిత్స జరిగిన సమయంలో తనను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడం వల్ల చాలా ఒంటరితనం అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు.

స్నేహితుల గురించి తన్మయ్ వ్యాఖ్యలు:

ఆ క్లిష్ట సమయంలో ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన రమ్య ఒక్కరోజు వచ్చి తనకు సహాయం చేసి, ఇంటి వద్దకు చేర్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన సైదుల్ రెడ్డి చిన్న మనస్పర్థల కారణంగా తనతో లేకపోవడం బాధ కలిగించిందన్నారు. తాను ఎంతో అనుకున్న వ్యక్తులు కూడా ఆ సమయంలో పరామర్శించడానికి రాకపోవడం మరింత బాధించిందని తెలిపారు. ప్రస్తుతం జబర్దస్త్‌లో నూకరాజు, ఇమ్మాన్యుయేల్ తనకు అత్యంత సన్నిహితులని చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:Rashmika mandanna:హీరోయిన్ రష్మికకు గాయం..ఆందోళనలో ఫాన్స్!

రీల్స్, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు:

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఫాలోవర్లను (Jabardasth)పెంచుకోవడానికే కాకుండా ప్రజల్లో తన గుర్తింపును కొనసాగించడానికి కూడా ఉపయోగపడుతుందని తన్మయ్ చెప్పారు. తండ్రి మరణం తర్వాత కొంతకాలం రీల్స్‌కు దూరంగా ఉన్నానని, ఇప్పుడు మళ్లీ వాటిపై దృష్టి పెట్టానని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Pragya Jaiswal: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న ప్రగ్యా జైస్వాల్!

గుర్తింపు ఉన్నప్పుడే లక్ష్యాలు నెరవేర్చుకోవాలి:

తాను స్వభావానికి చాలా ఇంట్రోవర్ట్‌నని, కొత్తవారితో మాట్లాడటానికి కొంత సంకోచిస్తానని తన్మయ్ చెప్పారు. అయితే స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత మాత్రం ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని, కెమెరా లేదా స్టేజ్ ఫియర్ తనకు ఎప్పుడూ లేదన్నారు. చిన్నతనంలో హెలికాప్టర్ చూడటానికే పరుగులు తీసిన తాను, ఇప్పుడు తనను చూసేందుకు అభిమానులు రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ గుర్తింపు శాశ్వతం కాదనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని, అవకాశం ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ఆస్తులు సమకూర్చుకోవాలనేది తన ఆలోచన అని చెప్పారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you