TV:స్టార్ మాలో ప్రసారమవుతున్న “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన నటి “అమూల్య గౌడ” మరోసారి వార్తల్లో నిలిచారు. మీనా పాత్రతో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగులు వెయ్యబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాజాగా స్టార్ మా (TV)విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోలో నటుడు నిరంజన్ తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతుంది.
మా బోనాల జాతరలో సస్పెన్స్ హైలెట్ :
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిర్వహించే బోనాల పండుగను పురస్కరించుకొని స్టార్ మా “మా బోనాల జాతర” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోలో అమూల్య – నిరంజన్ చుట్టూ ఆసక్తికరమైన సస్పెన్స్ సృష్టించారు. వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది అనే సందేశం తో ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచేశారు. పట్టు వస్త్రాలు, సాంప్రదాయ అలంకరణలు, శివసుత్తుల పూనకాలు, డప్పుల వాయిద్యాలతో బోనాల వేడుకను అద్భుతంగా చిత్రీకరించారు. మా సీరియల్ నటీనటులు ఒకే వేదికపై కనిపించనున్న ఈ కార్యక్రమంలో డాన్స్ ప్రదర్శనలు, వినోదాత్మక స్కీట్లు, ప్రత్యేక ఆకర్షణలతో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
also read:Rana:రానా కొత్త ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్.. ఇంతగా మారిపోవడానికి కారణమేంటి?
అభిమానుల్లో పెరిగిన ఆసక్తి :
కొద్ది రోజుల క్రితమే అమూల్య గౌడ తన ప్రేమికుడు నిరంజన్ ను అభిమానులకు అధికారికంగా పరిచయం చేశారు. ఇద్దరూ కలిసి చేసిన సోషల్ మీడియా పోస్టులు ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వీడియోలు మంచి స్పందన అందుకున్నాయి. ఇప్పుడు స్టార్ మా ప్రోమో లోను ఇద్దరు కలిసి కనిపించడంతో నిజంగానే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు ఏమో అని చర్చ జోరుగా సాగుతుంది. పండుగ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రతి ఏడాది మంచి టిఆర్పి రేటింగ్ సాధించే స్టార్ మా ఈసారి కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈసారి జాతర మరింత ప్రత్యేకమంటూ విడుదల చేసిన ప్రోమో ఇప్పటికే నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసార తేదీ, సమయాన్ని చానల్ త్వరలోనే ప్రకటించబోతుంది. అమూల్య నిరంజన్ ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!
also read:Ramayana:రామాయణ ట్రైలర్‌లో మెరిసిన సురభి దాస్ ఎవరు?
మా బోనాల జాతర ❤️🪔
ఈసారి జాతర సందడి మరింత ప్రత్యేకం! ✨
నిరంజన్, అమూల్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. 💍❤️
త్వరలో మీ ముందుకు!🥳Watch #MaaBonalaJathara Coming Soon only on #Starmaa#StarmaaPromo pic.twitter.com/Zx0D6dmQk9
— Starmaa (@StarMaa) July 31, 2026




