Tollywood:సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన ప్రతి ఒక్కరి ప్రయాణం సులభంగా ఉండదు. ఎన్నో కష్టాలు, అనుభవాలు, చిన్న చిన్న ఉద్యోగాల నుంచి ప్రారంభమైన కెరీర్లు తర్వాత గొప్ప విజయాలకు దారితీస్తాయి. అలాంటి అరుదైన ప్రయాణం చేసిన నటీమణుల్లో సహజ నటి సుహాసిని ఒకరు. హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకునే ముందు ఆమె కెమెరా విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం చాలా మందికి తెలియదు.
కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభం:
సినిమాలపై అపారమైన ఆసక్తితో ఇండస్ట్రీలో(Tollywood) అడుగుపెట్టిన సుహాసిని మొదట అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అశోక్ కుమార్, ఎన్.కె. విశ్వనాథన్‌ల వద్ద శిక్షణ పొందుతూ పలు చిత్రాలకు పనిచేశారు. సుమారు ఏడు సినిమాల వరకు కెమెరా విభాగంలో సేవలందించిన ఆమె, పురుషులతో సమానంగా కెమెరా ట్రాలీలు నెడుతూ, షూటింగ్‌లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు. సుహాసిని అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా పనిచేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా కూడా ఉండడం విశేషం.
also read:Shruti Haasan: గ్రీన్ శారీలో ఆకట్టుకుంటున్న శృతిహాసన్!
హీరోయిన్‌గా సూపర్ సక్సెస్:
దర్శకుల సూచనతో కెమెరా వెనుక నుంచి కెమెరా ముందుకు వచ్చిన సుహాసిని తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటనతో ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. ప్రస్తుతం సుహాసిని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లకు తల్లి, అత్త, కుటుంబ పెద్ద పాత్రల్లో కనిపిస్తూ ప్రతి పాత్రకు తనదైన ముద్ర వేస్తున్నారు. కెమెరా అసిస్టెంట్‌గా ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
also read:OTT:అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ
సుహాసిని రచయితగా ,దర్శకురాలిగా, నిర్మాతగా దక్షిణాది ఇండస్ట్రీలో పలు భాషలలో నటించింది. కమలహాసన్ అన్న నటుడు చారు హాసన్ కూతురే సుహాసిని.. 1988లో ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన మణిరత్నం ను వివాహం చేసింది వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. వివాహమనంతరం కూడా సుహాసిని పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది అలాగే డైరెక్టర్ మణిరత్నం కూడా ఇప్పటికీ పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.




