Tuesday, August 4, 2026
HomeLATESTTollywood:ఆగస్టు నెలలో విడుదలైయ్యే సినిమాల లిస్ట్ ఇదే..అన్ని సూపర్ హిట్సే..!

Tollywood:ఆగస్టు నెలలో విడుదలైయ్యే సినిమాల లిస్ట్ ఇదే..అన్ని సూపర్ హిట్సే..!

Tollywood:ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదల కానున్న తెలుగు సినిమాల పూర్తి జాబితా . వరుణ్ తేజ్ నటించిన Korean Kanakaraju నుంచి శర్వానంద్ Bhogi వరకు విడుదల తేదీలు, నటీనటులు, సినిమాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Tollywood: ఇది నిజంగా సినీ ప్రియులకి ఒక మంచి కిక్ ఎక్కించే న్యూస్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కే నెలలో వరుసగా భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నెల మొత్తం ప్రేక్షకులకు వినోద విందుగా మారబోతుంది అని చెప్పడంలో నో డౌట్. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల చిత్రాలు వరకు పలు చిత్రాలు ఈ ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ఈసారి తెలుగు సినిమాల(Tollywood) హవా ఎక్కువగా ఆగస్టు నెలలో కనిపించబోతోంది.

ఆగస్టు 7న కొరియన్ కనకరాజు విడుదల:

ఈ నెలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో వరుణ్ నటించిన “కొరియన్ కనకరాజు” కూడా ఒకటి. ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాని అందుకుంటుందనే నమ్మకం సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Nithin :నితిన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వైరల్!

రవితేజ, సూర్య సినిమాలతో మరింత క్రేజ్:

ఆగస్టు నెలలో మాస్ మహారాజ రవితేజ అదే విధంగా తమిళ్ సూపర్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , మమిత బైజు నటించిన “విశ్వనాథన్ సన్స్” ఆగస్టు 14వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఇక రవితేజ నటించిన “ఇరుముడి” సినిమా కూడా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 21న న్యాచురల్ స్టార్ నాని నటించిన ది పారడైజ్ సినిమా విడుదల కాబోతోంది. దీంతో స్టార్ హీరోల చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం సినీ మార్కెట్ కు మరింత ఊపునివ్వనుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Samantha:సోషల్ మీడియాలో సమంత సంచలన పోస్ట్!

ఇక ఈ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన “ఐయామ్ గేమ్”.. ఆగస్టు 20వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక అదే విధంగా హీరో యాష్ హీరోగా పాన్ ఇండియా గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామగా తెరకెక్కుతున్న “టాక్సిక్” ఆగస్టు 26వ తేదీన రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న పిరియాడిక్ డ్రామా “భోగి” ఆగస్ట్ 28న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ ఆగస్టు నెల తెలుగు చిత్రసీమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు పరిశ్రమ మరింత బలంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you