Wednesday, August 5, 2026
HomeLATESTBigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!?

Bigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!?

Bigg Bosss10:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొననున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Bigg Bosss10:తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభానికి సన్నాహాలు వేగంగా ముందుకు వెళుతున్నాయి. ఇది షోలో పదో సీజన్ కావడంతో నిర్వాహకులు ఈసారి మరింత వైవిధ్యంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కొత్త టాస్కులు, విభిన్నమైన నిబంధనలు, ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సీజన్లో చాలా ప్రత్యేకంగా నిలపాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలివిజన్ వర్గాలు చెబుతున్నాయి.

కంటెస్టెంట్ల జాబితా పై సోషల్ మీడియాలో చర్చ:

షో ప్రారంభ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు టాప్ సెలబ్రిటీస్ పేర్లు, అదేవిధంగా టెలివిజన్ నటులు, యూట్యూబర్లు,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కామెడీ ఆర్టిస్టుల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రచారంలో ఉన్న జాబితాలో పల్లవి గౌడ, ఎక్స్ప్రెస్ హరి, తేజస్విని గౌడ, జబర్దస్త్ నూకరాజు, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాకింగ్ రాకేష్, ఇన్ఫ్లుయెన్సర్ నందు, చంద్రహాస్, పవిత్ర, వర్ష, వర్షిని వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటిల్లో ఏకంగా మరొక స్టార్ హీరో పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -
Advertisement

also read:Varanasi: వారణాసి సినిమా స్టోరీ చెప్పిన రాజమౌళి..!

అబ్బాస్ ఎంట్రీ పై ఊహాగానాలు:

ఈసారి ఎక్కువగా చర్చకి వస్తున్న పేరు మాజీ స్టార్ హీరో అబ్బాస్. ఒకప్పుడు ప్రేమదేశం చిత్రంలో నటించి విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్న అబ్బాస్.. తెలుగు, తమిళ, భాషలలో దాదాపు 50 కి పైగా చిత్రాలలో నటించారు . అనంతరం సినీ పరిశ్రమకు దూరమైన ఆయన విదేశాల్లో స్థిరపడి ఇటీవల మళ్ళీ నటనపై ఆసక్తి చూపిస్తూ కొన్ని కొత్త ప్రాజెక్టులలో కనిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Raashii Khanna: బికినీ ఫోజులతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్

అయితే ఇదే సమయంలో బిగ్బాస్ సీజన్ 10(Bigg Bosss10) లోకి హీరో అబ్బాస్ ని తీసుకురావడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నో డౌట్ ఈసారి కప్పు కొట్టేది అబ్బాస్ నే అంటున్నారు అభిమానులు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. చూడాలి మరి ఈ వార్తలోని నిజాన్ని నిజాలు గ్రాండ్ లాంచ్ రోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అబ్బాస్ ఇటీవలే హ్యాపీ రాజ్ అనే చిత్రం తో రీ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది .ఈ సినిమా అబ్బాస్ కు మంచి పేరు తీసుకువచ్చింది .మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు ,ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ నిజమైతే విన్నర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు .

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you