Thursday, August 6, 2026
HomeLATESTRenu Desai:టార్చర్ చేయకండి.. రేణు దేశాయ్ కామెంట్స్!

Renu Desai:టార్చర్ చేయకండి.. రేణు దేశాయ్ కామెంట్స్!

Renu Desai: ప్రముఖ సినీనటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

on
- Advertisement -banner Ad

Renu Desai:టాలీవుడ్ లో సీనియర్ నటిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగజీవాల పైన జరిగే ఎలాంటి సంఘటనలనైనా సరే ఖండిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం కొంతకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంది.

రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ అభిమాని కామెంట్..

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రేణు దేశాయ్(Renu Desai) చేసే పోస్టులను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను కొన్ని సందర్భాలలో వదిన అని పిలుస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా పిలవడం పైన కూడా ఎన్నోసార్లు అసహనాన్ని వ్యక్తం చేసింది రేణు దేశాయ్. అంతేకాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా తరచూ అభిమానులతో నెటిజనులతో పంచుకుంటుంది. ఇటువంటి క్రమంలోని తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు..”వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే బాగుండేదేమో.. ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మీరు వెళ్లిపోయారు. కాని ఈరోజు ఆయన విలువ మీకు తెలుస్తోంది.. డెస్టిని అన్ని డిసైడ్ చేస్తుంది. పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేశారు”.

- Advertisement -
Advertisement

also read:Bhagya Shri Borse: మెరూన్ డ్రెస్ లో భాగ్య శ్రీ గ్లామర్ లుక్!

బుద్ధుందా అంటూ మండిపడ్డ రేణు దేశాయ్…

ఈ వ్యాఖ్యలకు రేణు దేశాయ్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఆ అభిమాని కామెంట్ కి ఇలా రిప్లై ఇస్తూ”మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా మాట్లాడే వారు కాదు . ఆయన వదిలేసి పెళ్లి చేసుకున్నారు .నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ పెట్టకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రేణు దేశాయ్. తానుగా వెళ్ళిపోలేదని పవన్ కళ్యాణ్ తనను వదిలేసి మరో వివాహం చేసుకున్నారంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Jana Nayagan:భారీగా నష్టపోయిన జననాయగన్ డిస్ట్రిబ్యూటర్స్..!

రేణు దేశాయ్ పెళ్లి, విడాకులు..

ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో క్షణాలలో వైరల్ గా మారింది. రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాలో నటించింది. 2009లో వివాహం చేసుకోగా కొన్ని కారణాల చేత 2012లో విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించని రేణు దేశాయ్ 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలకమైన పాత్రల నటించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you