Jana Nayagan:కోలీవుడ్ హీరో తమిళనాడు సీఎం విజయ్ దళపతి చివరిగా నటించిన చిత్రం జననాయగన్. ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూలై 23 2026న భారీ స్థాయిలో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై విజయ్ అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ అంచనాలు మొత్తం తలకిందులయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా రాబట్ట లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లు వినిపిస్తున్నాయి.
భగవంత్ కేసరి రేంజ్ లో లేదంటూ విమర్శలు..
జననాయగన్(Jana Nayagan) సినిమాని తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే ఊహగానాలు మొదటి నుంచే రావడంతో పెద్దగా హైప్ ఏర్పడలేదు. ఆ సినిమాకి సంబంధించి కొంతమేరకు సన్నివేశాలు ఉన్నప్పటికీ ఒరిజినల్ చిత్రంతో పోలిస్తే బలమైన భావోద్వేగాలు, తండ్రి కూతుర్ల అనుబంధం , కథలోని ఎమోషన్స్ అన్నీ కూడా డైరెక్టర్ హెచ్ వినోద్ అదే స్థాయిలో చూపించలేకపోయారనే విధంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదటి భాగం వరకు కథ ఆసక్తికరంగా చూపించినప్పటికీ , రెండో భాగంలో మాత్రం కథను చాలా బలహీనపరిచాయని సోషల్ మీడియాలో సైతం అభిప్రాయపడుతున్నారు.
also read:Keerthy Suresh:కీర్తి సురేష్ చేతిలో అన్ని సినిమాలా..?
డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం..
జననాయగన్ సినిమా విడుదలైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా భారీగా ప్రభావం చూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రూ. 203 కోట్ల రూపాయల వరకు థియేటర్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్యే సరికి సుమారుగా 135 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు సుమారుగా 25 నుంచి 30% వరకు నష్టాలు వచ్చినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.
also read:OG 2:ఓజీ 2 పై పవన్ ఫ్యాన్స్ కు నిరాశ!
తెలుగు ఆడియన్స్ ఆదరించలేదా?
ముఖ్యంగా తెలుగులో భగవంత్ కేసరి సినిమాని చూసిన ప్రేక్షకులు అదే సినిమాని తమిళంలో రీమిక్స్ చేసి డబ్ చేసి విడుదల చేయడంతో పెద్దగా ఎవరు ఆసక్తి చూపించడం లేదని వినిపిస్తోంది. దీంతో జననాయగన్ సినిమా హక్కులు తెలుగులో 14 కోట్ల రూపాయల వరకు అమ్ముడు పోగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. దీంతో జననాయగన్ విజయ్ చివరి చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ చివరి చిత్రం జననాయగన్ కాదని , త్వరలోనే మరో సినిమాని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ విజయ్ మాత్రం తమిళనాడు సీఎంగా అన్ని విధాలా అక్కడ ప్రజలను ఆకట్టుకునే పనులు చేస్తూ దూసుకుపోతున్నారు.




