RAAKA:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ పాన్ ఇండియా సినిమా “రాకా”. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా “రాకా” ఫస్ట్ లుక్ అయితే అభిమానులను రేంజ్ లో ఆకట్టుకునింది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, స్టార్ కాస్టింగ్ .. ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించబోతున్నారు అనే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ “రాకా” సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానుల్లో కొత్త ఆసక్తి నెలకొంది.
షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ పై స్పష్టత :
గత కొన్ని రోజులుగా షారుక్ ఖాన్ కోసం ప్రత్యేక పాత్రను అట్లీ సిద్ధం చేశారు అని .. షారుక్ ఖాన్ కి కూడా ఈ పాత్ర వినిపించారు అని.. ఆయన ఓకే చేశారు అని టాక్. ఆ సన్నివేశాలను విదేశాలలో చిత్రీకరించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. గతంలో వచ్చిన “జవాన్” చిత్రంతో అట్లీ – షారుక్ కాంబినేషన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడిపోయాయి. అంతేకాదు వాళ్ల మధ్య మంచి బాండింగ్ కూడా కుదిరింది. దీంతో “రాకా” సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ పాత్ర చేయడం 90% కన్ఫామ్ అని అంతా అనుకున్నారు. మిగిలిన 10% అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఫిక్స్ అయిపోయిండేవారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అంటున్నారు సినీ వర్గాలు. చిత్ర బృందం కూడా ఇప్పటివరకు షారుక్ ఖాన్ పాత్ర పై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.
also read:Renu Desai:టార్చర్ చేయకండి.. రేణు దేశాయ్ కామెంట్స్!
ముంబైలోనే భారీ షూటింగ్ :
“రాకా” (RAAKA)టింగ్ ప్రస్తుతం ముంబైలో సర్వేగంగా కొనసాగుతుంది. మొదట దుబాయ్ తో పాటు మరికొన్ని విదేశీ ప్రాంతాలలో చిత్రీకరణ చేపట్టాలని భావించినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రణాళికలో మార్పులు చేశారు చిత్ర బృందం. ముంబై లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లోనే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పనులను ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్ధ నిర్వహిస్తుండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.
also read:Bhagya Shri Borse: మెరూన్ డ్రెస్ లో భాగ్య శ్రీ గ్లామర్ లుక్!
స్టార్ కాస్ట్.. రెండు భాగాల ప్రణాళిక :
అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్లో దాదాపు నిరంతరాయంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం భారీ భారీ స్టంట్స్ కూడా డూప్ లేకుండా చేస్తున్నారు అంటూ టాక్. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది . ఇప్పటివరకు దీపికా పదుకొనే కి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ కంప్లీట్ చేశారు అన్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రణాళికతో అట్లీ ముందుకు సాగుతున్నాడట. దానికోసం పక్క ప్లాన్ కూడా వేసుకున్నట్లు తెలుస్తుంది.
కోలీవుడ్ స్టార్ లేడీ స్పెషల్ రోల్:
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా అదే విధంగా మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అంతేకాదు ఈ సినిమాలో ఒక స్పెషల్ సర్ ప్రైజింగ్ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందట. ఆ విలన్ క్యారెక్టర్ ను కోలీవుడ్ టాప్ హీరోయిన్ చేయబోతున్నారు అన్నట్టు టాక్. ప్రస్తుతం “రాకా”కు సంబంధించిన ప్రతి వార్త సినీ అభిమానుల్లో భారీ చర్చకు దారితీస్తుంది. చూడాలి మరి దీనిపై అట్లీ ఏ విధంగా స్పందిస్తాడు అనేది..? అట్లీ ఎంత త్వరగా స్పందిస్తే అంత మేలు. లేకపోతే సోషల్ మీడియాలో లేనిపోని రాద్ధాంతాలు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???




