Wednesday, August 12, 2026
HomeLATESTjanhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..!

janhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..!

Janhvi kapoor: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఇప్పుడు కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమెకు ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.

on
- Advertisement -banner Ad

janhvi kapoor : తెలుగు సినీ పరిశ్రమలో అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి.. తన అందం, అభినయంతో అటు బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగులో దేవర, పెద్ది వంటి చిత్రాలతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో మాత్రం వరుస పెట్టి అవకాశాలు అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ లోకి జాన్వీ కపూర్..

ప్రస్తుతం జాన్వీ కపూర్(janhvi kapoor )తన రూటుని మార్చేసినట్లు వినిపిస్తుంది. కేవలం వెండితెర పైన కాకుండా డిజిటల్ ప్లాట్ఫారం లో కూడా తన నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రం పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఒక భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిందని, ఈ ప్రాజెక్టు ద్వారానే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ నటిస్తోంది. దీని ద్వారానే తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Actress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

పవర్ ఫుల్ టైటిల్..

ఈ వెబ్ సిరీస్ కి కురతి అనే ఒక పవర్ఫుల్ టైటిల్ని కూడా పరిశీలిస్తున్నారు. వైవిధ్యమైన గ్రామీణ నేపథ్య కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించేలా ప్రముఖ డైరెక్టర్ శర్గుణమ్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన పా రంజిత్ వ్యవహరిస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ నిజజీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఎమోషనల్ అండ్ డ్రామా ఎలిమెంట్స్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి వెబ్ సిరీస్ ల వల్ల కూడా తనలోని అసలైన నటనని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్.

- Advertisement -
Advertisement

also read:Actress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

జాన్వీ కపూర్ సినిమాలు..

జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో నటించింది. అయితే ఇందులో తన పాత్ర పైన సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ వచ్చింది. అయినా కూడా ఆమె మాత్రం ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నది.. ఒకవేళ డైరెక్ట్ పా.రంజిత్ నిర్మిస్తున్న కురుతి వెబ్ సిరీస్ కనుక జాన్వీ కపూర్ ఓకే చెబితే మాత్రం ఆమె కెరియర్ లోనే ఇదే మరో కీలక మలుపు అవుతుందని పలువురు అభిమానులు, నెటిజన్స్ కూడా భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you