Thursday, August 13, 2026
HomeLATESTAnupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..!

Anupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..!

Anupama :టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ తన గత ప్రేమ సంబంధంలో ఎదురైన భావోద్వేగపరమైన అనుభవాల గురించి మాట్లాడిన అంశాన్ని ప్రతిబింబించే ఫీచర్ ఇమేజ్.

on
- Advertisement -banner Ad

Anupama :”అనుపమ పరమేశ్వరన్”..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెంచుకున్న అందాల ముద్దుగుమ్మ. సినిమా సినిమాకి తన రేంజ్ ని మార్చుకుంటూ వెళ్లిన ఈ బ్యూటీ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాలుగా వినిపించింది. కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అని.. మరి కొంతమంది మోసపోయింది అని.. మరి కొంతమంది ఇంకోలా.. రీసెంట్గా వీటన్నిటిపై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలలో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పలు రకాల వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడింది. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెండేళ్లుగా వేధింపులు :

ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్(Anupama )తన జీవితంలో ఎదురైన అత్యంత చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తాను దాదాపు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదుర్కొన్నాను అని చెప్పింది. ఆ వ్యక్తి పేరు చెప్పేందుకు ఇష్టపడ లేదు. అయితే ఆ సమయంలో ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షభని అనుభవించాను అని చెప్పి ఎమోషనల్ అయింది.

- Advertisement -
Advertisement

also read:Jabardasth Venky:జబర్దస్త్ వెంకీ వివాదం.. యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రేమ పేరుతో కంట్రోల్ :

ప్రారంభంలో ఆ వ్యక్తి తనపై చాలా ప్రేమ చూపేవాడు అని.. అసలు ఇంత ప్రేమ చూపే వాళ్ళు ఉంటారని సందేహం వచ్చే అంతలా ప్రేమను వలకబోసే వాడు అని.. ఒకరోజు విపరీతమైన ప్రేమ చూపించి మరుసటి రోజు అదే ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ తీవ్రంగా కోప్పడే వాడు అని.. అనంతరం చిన్నపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరడం.. మళ్ళీ అలాంటి ప్రవర్తన ఉండదని హామీ ఇవ్వడం.. సరిగ్గా 24 గంటలు కాకముందే మళ్ళీ తిరిగి అదే క్రూరత్వాన్ని ప్రదర్శించడం జరిగింది అని ఆమె చెప్పుకొచ్చారు. మూడు నెలల పరిచయంలోనే నిశ్చితార్థం..డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారు అని అనుపమ తెలిపింది. తన కెరియర్ ని వదిలేసి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకురావాలని ప్రయత్నాన్ని నేను గుర్తించాను అని ఆ తర్వాత పలుమార్లు ఎంగేజ్మెంట్ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Irumudi:ఆకట్టుకుంటున్న రవితేజ ఇరుముడి ట్రైలర్..!

కెరీర్ పైన ప్రభావం :

ఆ కారణంగానే మందులు కూడా తీసుకోవాల్సి వచ్చింది అంటూ బాధపడింది. తన కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్న డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ లోనూ పూర్తిగా పాల్గొనలేక పోవడానికి కారణం అతడే అంటూ చెప్పేసింది. ఒకవేళ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునే ఉంటే కచ్చితంగా విడాకులు తీసుకునేసి ఉండేదాన్ని అంతలా నా మనసును బాధపెట్టి నన్ను టార్చర్ చేశారు అని చెప్పకనే చెప్పేసింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆ టార్చర్ దశ నుండి ఇప్పుడిప్పుడే బయటపడి మెల్లగా లైఫ్ ని లీఖ్చేస్తున్నాను అని.. మళ్లీ ఆనందకరమైన జీవితాన్ని ప్రశాంతతకు తిరిగి పొందాలని అనుపమ కోరుకుంటుంది.

- Advertisement -
Advertisement

ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ ని మరొకసారి గుర్తు చేసుకుంటుంది సోషల్ మీడియా. ఆయన ఒక బిగ్ స్టార్ హీరో కొడుకు అన్న విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో గుచ్చి గుచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద వ్యక్తి కొడుకు ఇంత నీతిమంతుడా..? అంటూ రకరకాలుగా ఘాటుగా కౌంటర్ లు వేస్తున్నారు..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you