Thursday, August 13, 2026
HomeLATESTWamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి

Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి

Wamika Gabbi: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి మూవీ లైనపు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

on
- Advertisement -banner Ad

Wamika Gabbi:ఈ ఏడాది హీరోయిన్ వామికా గబ్బికి బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలోనే అక్షయ్ కుమార్ తో కలిసి బూత్ బంగ్లా అనే చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కామెడీ హర్రర్ సినిమాగా తెరకెక్కించడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో టాప్ 5 లో నిలిచింది.ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో 2 చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నటించిన డిసి సినిమాలో కూడా హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో వామికా పోషించిన చంద్ర పాత్ర కూడా ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రంలో తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది.

తెలుగు మూవీలో అవకాశం అందుకున్న వామికా గబ్బి..

ఇందులో ఈమె నటించిన నటన అందరి చేత ఆకట్టుకునేలా చేసింది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటున్న వామికా గబ్బి(Wamika Gabbi )ఇప్పుడు తాజాగా అడవి శేష్ నటిస్తున్న గూడఛారి 2 చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్న జై హనుమాన్ చిత్రంలో కూడా వామికా గబ్బి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జై హనుమాన్ చిత్రం షూటింగ్ మార్చిలో మొదలయ్యింది. కానీ వామిక గబ్బి పాత్రకు సంబంధించి చాలా గోప్యంగా ఉంచినట్లుగా వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..!

వరుస చిత్రాలతో ఫుల్ బిజీ..

హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. 2024లో విడుదలైన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నారు. మరి వామిక గబ్బి పాత్రకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తుందేమో చూడాలి మరి. ఇదే కాకుండా తమిళంలో జయం రవి నటిస్తున్న జినీ చిత్రంలో కూడా నటిస్తోంది. వీటితోపాటుగా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం నంబర్ వన్‌..మస్ట్ వాచ్ ఫిలిం!

వామికా గబ్బి సినిమాలు..

వామికా గబ్బి పంజాబీ, తమిళ్ , హిందీ, మలయాళం, తెలుగు వంటి భాషలలో సుమారుగా 22 చిత్రాలకు పైగా నటించగా.. మొదటిసారి 2007లో జబ్ వి మెట్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లోకి మాత్రం 2015 లో వచ్చిన భలే మంచి రోజు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో హిందీ , తమిళ్ చిత్రాలలో నటిస్తున్న వామికా గబ్బికి ఇప్పుడు వరుస అవకాశాలు రావడంతో రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా ఈ మధ్య ఈమె చేతిలో ప్రస్తుతం ఏడు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you