Shakeela:సాధారణంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ చూసే అలవాటు ఉండనే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని అలవాట్ల వల్ల చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. అలా ఇప్పుడు తాజాగా ప్రముఖ నటిగా పేరు సంపాదించిన షకీలా తాను ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని అందరితో పంచుకుంది. గంటల తరబడి మొబైల్ చూడడం, పడుకొని వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం వంటివి చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యిందంటూ షకీలా తెలియజేసింది.
షకీలా మెడకు శస్త్ర చికిత్స..
అంతేకాకుండా ఈ సమస్య కారణం చేత మూడు లక్షల రూపాయల ఖర్చుతో మెడకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షకీలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో మొబైల్ ఎక్కువగా వినియోగించే అభిమానులకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. ఇటీవల షకీలా శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోగా మెడకు కాలర్ ధరించిన ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో తాను ఆ పరిస్థితికి రావడానికి గల కారణాన్ని తెలియజేసింది. ఒక పక్కకు తిరిగి గంటల తరబడి పడుకొని మొబైల్ గేమ్స్ ఆడేదాన్ని.. యూట్యూబ్ వీడియోలు చూసేదాన్ని ..అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా చూస్తూ సమయాన్ని గడిపేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
also read:Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్?
దయచేసి జాగ్రత్తగా వాడండి..
మధ్యలో కేవలం కాఫీ, టీ వంటి వాటికి మాత్రమే లేచే దాన్ని ఆ అలవాటు కారణంగా మెడలోని నరాల పైన తీవ్ర ప్రభావం చూపించిందంటూ షకీలా తెలియజేసింది. మొదట చిన్న అసౌకర్యంగా అనిపించినా.. నెమ్మదిగా అది పెద్ద శస్త్ర చికిత్సకు కారణమయ్యిందంటూ తెలిపింది. అయితే ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇతరుల మీద ఆధారపడవలసి వస్తోందని షకీలా(Shakeela) తెలిపింది. ఈ అనుభవం తర్వాతే మొబైల్ వినియోగాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా తనకు అర్థం అయిందంటూ తెలిపింది. మొబైల్ ఉపయోగకరమైన పరికరమే కానీ అవసరానికి మించి వాడకూడదని ఈ విషయంతో తనకి స్పష్టం అయ్యింది అంటూ తెలిపింది షకీలా.
also read:Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి
ఇది ఒక గుణపాఠం..
అలాగే చిన్న పిల్లలకు మొబైల్స్ ఇచ్చి గంటల తరబడి వాటిలో మునిగిపోయేలా తల్లిదండ్రులు చేయవద్దు అంటూ కోరింది. అవసరమైన విషయాలకే మొబైల్స్ వాడండి, అనవసరపు విషయాలకు దూరంగా ఉంచండి అంటూ సూచించింది. షకీలా సినీ కెరియర్ విషయానికి వస్తే 1990 లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షకీలా.. 2000 సంవత్సరంలో కిన్నెరతుంబికల్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ వచ్చింది. ఎక్కువగా బోల్డ్ పాత్రలలో కనిపిస్తూ ఉండేది షకీలా. మొత్తానికి తన జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తెలియజేసింది.
உங்கள கெஞ்சி கேட்டுக்கிறேன்.. இதை பண்ணாதீங்க – உடல்நிலை சரியில்லாமல் நடிகை ஷகீலா வெளியிட்ட வீடியோ#shakeela #pain #mobilephone #phones #awerness #vendhartv #vnews27 pic.twitter.com/6PDIRkx708
— V News27 (@vnews27) August 13, 2026




