Pavithra Gowda:చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న నటి పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన దాదాపు 8 నెలల క్రితమే కన్నుమూసినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంజయ్ సింగ్ రాజస్థాన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో, బుల్లితెరపై ఇప్పుడు ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యకాలంలో పవిత్ర గౌడ పేరు ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రేమించి పెళ్లి:
పవిత్ర గౌడ సాధారణ యువతిగా ఉన్న సమయంలోనే రాజపేటకు చెందిన సంజయ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి, ఆ స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం నిర్వహించిన ఆయనకు, పవిత్ర గౌడకు ఓ పాప కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే కొంతకాలం తర్వాత పవిత్ర గౌడ బుల్లితెరపై ఉన్న ఇంట్రెస్ట్‌తో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకొని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు.
ALSO READ:TV:గురువారం టీవీలో సినిమాల సందడి.. పూర్తి లిస్ట్ ఇదే!
విడాకులు తర్వాత పెరిగిన దూరం
పవిత్ర గౌడ సినీ రంగంలో బిజీగా మారిపోయింది. పవిత్ర గౌడ(Pavithra Gowda) తన నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. సీరియల్స్‌లో అవకాశాలు అందుకుంటూ, మరో పక్క సినిమాలలో తనదైన శైలిలో నటించి మెప్పించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఆ కారణంగానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అంతేకాదు, వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో వీళ్ల గురించి జనాలు ఎక్కువగా చర్చించుకున్నారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ మందుకి బానిస అయిపోయాడు. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా చెడు వ్యసనాలు అలవాటు చేసుకున్నారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు చికిత్స అందించినట్లు తెలుస్తుంది. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది.
ALSO READ:Brahmanandam:బ్రహ్మానందంపై సోదరుడు షాకింగ్ కామెంట్స్..!
ఎనిమిది నెలల తర్వాత సమాచారం:
రేణుక స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆమె మాజీ భర్త సంజయ్ సింగ్ మరణించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మరొకసారి చిత్రదుర్గ రేణుక స్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న పవిత్ర గౌడ పేరు టాపిక్‌గా మారిపోయింది.




