Anasuya:నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ అనసూయ. నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తన పైన ఎలాంటి ట్రోలింగ్ జరిగినా సరే వాటికి దీటుగానే సమాధానం చెబుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా భారతీయ సాంప్రదాయాలు, స్త్రీల అలంకరణ పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన తల్లి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ స్త్రీల కట్టు బొట్టు గాజుల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
నాన్న మరణం.. అమ్మ ముఖాన్ని చూడలేకపోతున్నా – అనసూయ
ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అనసూయ ఆ వీడియోలో ఇలా మాట్లాడుతూ.. తన తల్లి గతంలో కళ్లకు కాటుక, నుదుట బొట్టు, తలలో పూలు పెట్టుకొని చాలా నిండుగా, అందంగా ఉండేదని.. మూడేళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత తల్లి ఆలంకరణ అన్నిటికీ కూడా దూరం కావడం తనని చాలా కలిచి వేసిందని తెలిపారు.. ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మ,అమ్మమ్మలు గాజులు, కాటుక ,గజ్జలు, గోరింటాకు వంటి అలంకరణలను అలవాటు చేస్తారని.. అలాంటి సాంప్రదాయాలను పెళ్లితో ముడిపెట్టి భర్త మరణించగానే వాటన్నిటిని దూరం చేస్తారు.. ఇది ఎంతవరకు సంజసమని ప్రశ్నించింది అనసూయ.
ALSO READ:Zombie Reddy 2: జాంబిరెడ్డి 2 నుండి గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్..!
ఆడవారి అలంకరణలకు భర్త.మరణంతో సంబంధం ఏమిటి?
ఒకవేళ అలంకారాలు తీసివేయవలసి వస్తే అమ్మా లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి కానీ భర్త మరణంతో వీటికి ఎందుకు లింకు పెడతారంటూ అనసూయ తన మనసులో మాటని పంచుకుంది. అయితే అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ సైతం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. భర్త మరణించిన తర్వాత బొట్టు పెట్టుకోవచ్చని వాదించిన అనసూయ.. ఆ వీడియోలో నుదుటిన బొట్టు పెట్టుకోకుండా కనిపించడంతో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. భర్త బతికున్నప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోకుండా వీడియోలు చేస్తూ సమాజానికి ఇలాంటి నీతులు చెబుతున్నావా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీని షేక్ చేస్తోన్న సినిమా..డోంట్ మిస్..!
జైశ్రీరామ్ వివాదం మరువక ముందే..
ఇటీవల సోషల్ మీడియాలో జైశ్రీరామ్ నినాదం పైన అనసూయ(Anasuya) చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. సనాతన ధర్మాన్ని కించపరిచారు అంటూ ఆమె పైన పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయింది. ఈ విషయం పైన అనసూయ తాను కూడా హనుమంతుడి భక్తురాలినినని భక్తి ముసుగులో కొంతమంది మహిళలను వేధించే వారిని మాత్రమే ప్రశ్నించాను అంటూ అనసూయ వివరణ ఇచ్చింది. అయినా కూడా ఇప్పటికీ వివాదం సద్దుమనగలేదు. ఈ క్రమంలోని సీనియర్ నటి హేమ కూడా అనసూయ పైన ఘాటుగానే స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేయడం మరింత సంచలనంగా మారింది. ఇప్పుడు అనసూయ కట్టు బొట్టు పైన చేసిన వ్యాఖ్యలు ఆమెను ట్రోలింగ్కి గురి చేస్తున్నాయి.
View this post on Instagram




