Friday, September 4, 2026
HomeLATESTActor Ali: కాలికి కట్టుతో కమెడియన్ అలీ!

Actor Ali: కాలికి కట్టుతో కమెడియన్ అలీ!

Actor Ali: సినిమాలు, షోలు అంటూ బిజీగా గడిపేస్తున్న అలీ సడన్గా కాలికి కట్టుతో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

on
- Advertisement -banner Ad

Actor Ali: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా పేరు సంపాదించిన వారిలో కమెడియన్ ఆలీ కూడా ఒకరు. ఎన్నో వందలాది చిత్రాలలో నటించి, ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఘనత అందుకున్నారు ఆలీ. అటు పొలిటికల్ పరంగా కూడా గత కొంతకాలంగా యాక్టివ్గా ఉన్న ఆలీ ఈ మధ్యకాలంలో పొలిటికల్ కు గుడ్ బై చెప్పేసి మరి సినిమాలలో నటిస్తున్నారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతున్నారు అలీ(Actor Ali). అంతేకాకుండా టీవీ షోలలో కూడా హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నారు.

కాలికి కట్టుతో కనిపించిన అలీ..

తాజాగా అలీకి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం తీవ్ర కలకలం చెందుతున్నారు. ఈ వీడియోలో ఆలీ ఎడమ కాలికి పెద్ద బ్యాండేజ్ కట్టుకొని, తీవ్రమైన గాయంతో సోఫాలో కూర్చొని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవ్వడంతో కమెడియన్ ఆలీకి ఏమయింది? షూటింగ్లో ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ అభిమానులు, నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్ కి సైతం చెక్ పెడుతూ ఆయన భార్య జుబేదా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Arjun:మొదటిసారి రాకా కోసం అల్లు అర్జున్ అలాంటి పని..!

అసలు విషయం చెప్పిన భార్య..

జుబేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. తన భర్త అలీకి ఎటువంటి ప్రమాదం జరగలేదని కాలికి , నిజమైన గాయం కాలేదని అదంతా కూడా ఒక సినిమా షూటింగ్లో భాగంగా వేసిన మేకప్ అంటూ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సరదాగా ఆలీ గారి కాలు విరిచేసి లంచ్ పెట్టారు యూనిట్ సభ్యులు అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అలీ కాలికి కట్టు కట్టుకొని నటిస్తున్న ఆ సినిమా పేరు ఏంటో అని అభిమానుల సైతం తెగ ఆసక్తిగా వెతికేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Allari Naresh: అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ నుంచి సినిమా రావాలంటే ఇంత కథ ఉందా?

అలీ చిత్రాలు..

1981లో సీతాకోకచిలుక అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంతో పాటుగా హరుడు అనే సినిమాలో నటించారు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన అలీ, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్ చిత్రాలకు ఉత్తమ హాస్య నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.. పలు రకాల టీవీ కార్యక్రమాలకు కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రస్తుతం అలీ ఎలాంటి చిత్రాలలో నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you