OTT:విశ్వనాథ్ అండ్ సన్స్.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా. ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. ఇంకా పక్కాగా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లలో ఇలా ఊపేసిన మూవీ ఏదీ లేదనే చెప్పాలి. ఆ తర్వాత ఇరుముడి సినిమా వచ్చింది. అది ఇంకా పెద్ద హిట్ అయింది.
ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ దూసుకెళ్లింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. దీంతో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉంది.
also read:Jayam Ravi:లవర్ తో అడ్డంగా బుక్కైన జయం రవి..సెన్సేషనల్ వీడియో లీక్..!
రూ.270 కోట్లకు పైగా కలెక్షన్స్ :
ఓవరాల్‌గా ఈ సినిమా దాదాపు రూ.270 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తుంది. సూర్య నటన, అదే విధంగా మమిత బైజు అల్లరి ఈ సినిమాకు బాగా ప్లస్‌గా మారాయి. చాలా కాలం తర్వాత సూర్యను ఒక లవర్ బాయ్ లుక్‌లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు.
ఇక రాధిక, రవీనా టాండన్ నటన సినిమాకి బాగా ప్లస్‌గా మారింది. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు ఒక ప్లస్ అయితే, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్ ఇంకొక ప్లస్‌గా మారింది. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.
also read:Madhuri Rathod:మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. లెటర్ వైరల్..!
సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలోకి? :
అయితే ఈ సినిమా ఓటీటీలోకి(OTT) ఎప్పుడెప్పుడు వస్తుందంటూ కోట్లాది మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
సాధారణంగా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మూవీ ఓటీటీలోకి వస్తుంది. ఇదే అన్ని సినిమాల విషయంలో ఒప్పందం జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
తెలుగుతో పాటు తమిళం, అటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బాగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.




