Tuesday, September 8, 2026
HomeLATESTYoutuber: ఎయిర్‌పోర్ట్‌ లో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్!

Youtuber: ఎయిర్‌పోర్ట్‌ లో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్!

Youtuber: నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నందనను పోలీసులు ఎయిర్ పోర్టు లో అదుపులోకి తీసుకున్నారు.

on
- Advertisement -banner Ad

Youtuber: సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీగా మారిన వారు ఉన్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో తమకు ఉండే పాపులారిటీని ఉపయోగించుకొని మరి భారీగా సంపాదిస్తున్నారు. అయితే అలా సంపాదిస్తున్న వారు చాలామంది పలు రకాల బ్రాండ్లను ప్రమోషన్స్ చేస్తూ తమ యూజర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి కొంతమంది తమకు ఉండే పాపులారిటీ ఉపయోగించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ఇలా ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాని ఉపయోగించుకొని చాలామంది సెలబ్రెటీసు మోసం చేశారంటూ తరచు ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉన్నాము. ఇప్పుడు తాజాగా ప్రముఖ యూట్యూబర్(Youtuber), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందుస్ వరల్డ్ నందనను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ లో నందనను అరెస్టు చేసిన పోలీసులు..

వీసా రెన్యువల్ తో లండన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిందనే ఆరోపణలతో ఈమె పైన, ఈమె కుటుంబ సభ్యుల పైన పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో రిటర్న్ లో వస్తున నందన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే అక్కడ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈమెను ఇబ్రహీంపట్నంలో వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో కేసు మరొక్కసారి చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..?

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కు చెందిన మామిళ్ళపల్లి శివ క్రాంతి కుమార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు ఇచ్చారు.. తన వీసా రెన్యువల్ తో పాటుగా తన భార్యకు కూడా లండన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని, అవసరమైతే ఓఎస్ ఇప్పిస్తామంటూ నందన ఆమె భర్త మధుకర్ హామీ ఇచ్చారని, ఆహామీతో వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నారని, అయితే అనంతరం వీసా రెన్యువల్ కానీ ఉద్యోగానికి సంబంధించి సిఓఎస్ గానీ ఇప్పించకుండా మోసం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు వల్ల గత ఏడాది డిసెంబర్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నందన A 1 కాగా ఆమె భర్త మధు A 2 గా అలాగే ఆమె మామ మోహన్ రావ్ A3 గా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Kavya Shree: స్టైలిష్ లెహంగాలో ఆకట్టుకుంటున్న కావ్య శ్రీ.. ఫోటోలు వైరల్!

లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ..

తర్వాత పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా వారు విదేశాలలో ఉన్నట్లు సమాచారం. అయితే వారి కదలికలను నిరంతరం గుర్తించేందుకు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. నందన ఆచూకీ కోసం ఆమె మామ మోహన్ రావ్ ను కూడా విచారించారు.. అయితే ఆయన తన కుమారుడు కోడలు ఎక్కడున్నారు అనే విషయం తనకి తెలియదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బ్రిటన్ లో నివాసం ఉంటున్న నందన సోమవారం రోజున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే ఆమె మీద లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లేడీ ఎస్సై సత్య సత్యవతి 35 బిఎన్ఎస్ నోటీసులు నందుకు అందించినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకురాబోతున్నారు. దీంతో నందన కేసుకు సంబంధించి అంశాల పైన పోలీసులు విచారించే అవకాశం ఉన్నది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you