Mahesh Babu:టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ తో సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వారణాసి సినిమా నుంచి ఏదో ఒకచోట సినిమా షూటింగ్ కి సంబంధించి లీక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తోంది.
విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న వారణాసి..
వారణాసి సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకొని.. రూ.320 థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో వారణాసి సినిమా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.122 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఆ తర్వాత RRR సినిమా రూ.230 కోట్ల వరకు బిజినెస్ చేసిందట . ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు(Mahesh Babu) వారణాసితో రూ. 320 కోట్ల మార్కును టచ్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది.
also read:Youtuber: ఎయిర్‌పోర్ట్ లో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్!
ఏకంగా రూ.320 కోట్లు డీల్..
తెలుగు రాష్ట్రాలలో వారణాసి సినిమా థియేట్రికల్ బిజినెస్ అత్యధికంగా జరిగిన సినిమాగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ విజువల్స్, ఇంటర్నేషనల్ లొకేషన్స్ విషయంలో కూడా నిరంతరం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇక డిస్ట్రిబ్యూటర్లు సైతం 320 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు అంటే ఏ స్థాయిలో ఈ సినిమా మీద నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. వారణాసి సినిమా కేవలం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మాత్రమే కాదు ఇండియన్ సినిమా స్థాయిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లేలా ఈ సినిమా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
also read:Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..?
వచ్చే ఏడాది విడుదల..
ఈ సినిమాకి దాదాపుగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే సినీ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన చిత్రంగా వారణాసి సినిమా ఉండబోతోంది. ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారణాసి సినిమా నుంచి పోస్టర్ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ కూడా లభించింది. వారణాసి సినిమా 2027 ఏప్రిల్7 న విడుదల చేయబోతున్నారు. మరి సినిమా విడుదలయితే ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.




