Tollywood:సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరో ఎప్పుడూ కాంపిటేటివ్‌గానే ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఎలా పోటాపోటీగా పోటీపడి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాశాయో చూస్తూనే వచ్చాం. ఇప్పుడు మరొకసారి అలాంటి పోటీ కనిపించబోతుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అది కూడా టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీకి పిల్లర్‌లాంటి హీరోలు కావడంతో ఇప్పుడు అందరూ ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.
22 ఏళ్ల క్రితం కూడా ఇదే పోటీ :
దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్‌లో పోటీ పడ్డ నందమూరి నటసింహం బాలకృష్ణ, అక్కినేని నాగార్జున.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఇదే పండుగ సీజన్‌కు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో 2004 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హీట్ అయితే నెలకొందో.. అలాంటి హీట్ 2026లో కనిపించనుంది.
2004 క్రిస్మస్ సీజన్‌లో బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ థియేటర్లలో రిలీజ్ అయింది. అదే సమయంలో అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘మాస్’ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఆ క్లాష్‌లో నాగార్జున నటించిన ‘మాస్’ సినిమా కొంచెం ఎక్కువ సక్సెస్ సాధిస్తూ విన్నర్‌గా నిలిచింది.
also read:TV:ఈ మంగళవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!
మళ్లీ క్రిస్మస్ బరిలో సీనియర్ హీరోలు :
ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు బరి లోకి వస్తున్నారు. దీంతో ఏ సినిమా హిట్ అవుతుంది? ఏ సినిమా ఫట్ అవుతుంది? అంటూ బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది.
బాలకృష్ణ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘దాదా’ అనే మాస్ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తనదైన శైలిలో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం పెద్ద ప్లస్‌గా మారిపోతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.
also read:Mahesh Babu:రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .320 కోట్లకు వారణాసి మూవీ!
100వ సినిమాతో నాగార్జున :
అయితే నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’తో బరిలోకి దిగుతున్నాడు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని మేకర్స్ పట్టుబట్టి కూర్చున్నట్లు తెలుస్తుంది.
నాగార్జున వందో సినిమా కావడం కచ్చితంగా ఒక ట్రెండ్ సెట్ చేస్తుందని అభిప్రాయం అందరిలో ఉంది. ఒకపక్క బాలకృష్ణ, మరోపక్క నాగార్జున.. ఒకే తేదీకి రెండు పడాల్సిన సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో రచ్చ రంగంలో ప్రత్యేకంగా చెప్పాలా?
ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడతారు? :
ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవరు విన్ అవుతారు? ఎవరు ఫ్లాప్ అవుతారు? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా ట్రెండ్ అవుతుంది. కెరీర్‌లో నాగార్జునకు ఇది ఒక బిగ్ స్టెప్. బాలకృష్ణ నటించిన ‘దాదా’ సినిమా కూడా వేరే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది.
రెండు సినిమాలకు హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ జనాలు ఏ సినిమాని ఎక్కువ ఆదరిస్తారు అనేది తెలియాలంటే డిసెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి సీనియర్ హీరోల సత్తా చాటుతాయని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




