Friday, September 18, 2026
HomeLATESTBalakrishna:అనుకున్న తేదీకే బాలయ్య మూవీ..!

Balakrishna:అనుకున్న తేదీకే బాలయ్య మూవీ..!

Balakrishna: గోపీచంద్ మదినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న దాదా మూవీ ని అనుకున్న సమయానికి విడుదల చేయనున్నట్లు మేకర్ స్పష్టం చేశారు.

on
- Advertisement -banner Ad

Balakrishna:టాలీవుడ్ సీనియర్ హీరోలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలా బాలయ్య కథానాయకుడిగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రంగా రాబోతున్న చిత్రం దాదా. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా భారీ విజయం కావడంతో ఇప్పుడు దాదా సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యకు గాయమై కొంత విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ.. సినిమా షూటింగులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు వినిపిస్తున్నాయి.

దాదా మూవీ రిలీజ్ డేట్ లాక్..

బాలయ్యకు(Balakrishna) జోడిగా ఇందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. విలన్ గా మంచు మనోజ్ ఒక పవర్ఫుల్ పాత్రలో ఇందులో కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గాయం తర్వాత ఇటీవల తిరిగి షూటింగ్ లో పాల్గొన్న బాలయ్య తన సీన్స్ అన్ని పూర్తి చేసే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజుల మాత్రమే బ్యాలెన్స్ షూటింగ్ ఉందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర బృందం వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Nabha Natesh: రెడ్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచేసిన నభా నటేష్!

బాలయ్యకు పోటీగా నాగార్జున..

అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ 24న దాదా చిత్రాన్ని చాలా గ్రాండ్గా థియేటర్లో విడుదల చేయాలని చిత్ర బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ పైన చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బాలయ్య కనిపిస్తున్న తీరు ఆయనను చూపించిన స్టైలిష్ లుక్ కూడా అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తోంది. మొత్తానికి బాలయ్య దాదా సినిమాతో డిసెంబర్ బరిలోనే దిగేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్లో నాగార్జున నటిస్తున్న కింగ్ సినిమా కూడా విడుదల కానుంది.

- Advertisement -
Advertisement

also read:Raaka movie: రాకా సినిమా అప్డేట్.. ఆసక్తి పెంచేస్తున్న కొత్త పోస్టర్..

బాలయ్య తదుపరి సినిమాలు..

బాలయ్య తదుపరి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ కొరటాల శివతో ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. చివరిగా బాలయ్య డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి దాదా సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రంతో బాలయ్య ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you